Youth's Social Media Stunts : కొండపై కుప్పిగంతులు..!
ABN, Publish Date - Dec 09 , 2024 | 04:31 AM
లైక్‌లు, సబ్‌స్ర్కైబ్‌లు, ఫాలోవర్ల కోసం కొందరు యువతీయువకులు కొండపై కుప్పిగంతులు వేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్న యువత
లైక్‌లు, సబ్‌స్ర్కైబ్‌ల కోసం సినిమా పాటలతో రీల్స్
తిరుమల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): లైక్‌లు, సబ్‌స్ర్కైబ్‌లు, ఫాలోవర్ల కోసం కొందరు యువతీయువకులు కొండపై కుప్పిగంతులు వేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నారు. తిరుమల, ఘాట్‌రోడ్లు, అలిపిరి వద్ద ఇష్టానుసారం సినిమా పాటలు, డైలాగ్‌లతో రీల్స్, షార్ట్స్, ప్రాంక్ వీడియోలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తిరుమలలో రీల్స్, ఫొటోషూట్ చేస్తే కేసులు పెట్టడంతో పాటు కెమెరాలు సీజ్ చేస్తామని టీటీడీ హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు లెక్కచేయడం లేదు. తాజాగా ఓ యువతి అలిపిరి చెక్‌పాయింట్ ముందు ‘పుష్ప2’ చిత్రంలోని ‘కిస్సిక్’ పాటకు డ్యాన్స్ చేసి తన ఇన్‌స్టా పేజ్‌లో పోస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అలాగే.. కొందరు శ్రీవారి ఆలయం ముందు, నడక దారుల్లో డ్యాన్సులతో రీల్స్ చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూనే ఉన్నారు. అలిపిరిలోని టూరిజం భవనం కూడా రీల్స్ చేసేవారికి అడ్డాగా మారిపోయింది. ఇకనైనా ఈ రీల్స్, షార్ట్స్ చేసే వారి విషయంలో టీటీడీ కఠిన చర్యలు తీసుకోకపోతే ఏడుకొండల ప్రతిష్ఠ మరింత దిగజారిపోయే అవకాశముందని భక్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - Dec 09 , 2024 | 04:31 AM