ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jagan - Tirumala: వైఎస్ జగన్ తిరుమల షెడ్యూల్ ఇదే..

ABN, Publish Date - Sep 26 , 2024 | 09:17 PM

YS Jagan Tirumala Tour Schedule: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది.

YS Jagan Tirumala Tour

YS Jagan Tirumala Tour Schedule: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ సెప్టెంబర్ 27వ తేదీన సాయంత్రం 4.50 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమలకు బయలుదేరుతారు.


రాత్రి 7 గంటలకు జగన్ తిరుమలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 28వ తేదీన శనివారం ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్‌ హౌస్‌కు బయలుదేరుతారు. ఆ తరువాత 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంటకు వెళతారు. 1.20 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి జగన్ వెళ్తారు.


తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆంక్షలు..

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నామని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు నెల రోజులు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 అమలులో ఉంటుందన్నారు. ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదని ఎస్పీ స్పష్టం చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా బహిరంగ సభలు లేదా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేయాలంటే లిఖిత పూర్వకంగా స్థానిక పోలీసు అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని.. పోలీసులు ముందస్తు అనుమతి ఇస్తేనే కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.


Also Read:

కొడాలి నానికి టీడీపీ ఎమ్మెల్యే మాస్ వార్నింగ్..

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

అది లారీ అనుకున్నావా.. లేక జిమ్ సెంటర్ అనుకున్నావా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 26 , 2024 | 09:17 PM