ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

EX CM Jagan : ఆ కేసులో నా పేరెక్కడుంది?

ABN, Publish Date - Nov 29 , 2024 | 03:07 AM

‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు.

  • అదానీ నాకు లంచం ఇచ్చినట్లు ఎక్కడ రాశారు?

  • ఒప్పందం సెకీతో.. థర్డ్‌ పార్టీ ఎక్కడ?

  • అతి తక్కువ ధరకు కొన్నాం.. లక్షల కోట్లు ఆదా చేశాం

  • మంచి చేసినందుకు నన్ను సన్మానించాలి

  • సీఎంతో పారిశ్రామికవేత్తల భేటీ మామూలే

  • 48 గంటల్లో ‘ఆంధ్రజ్యోతి’ క్షమాపణలు చెప్పాలి

  • లేదంటే... రూ.వంద కోట్లకు దావా వేస్తా

  • మాజీ సీఎం జగన్‌ బెదిరింపులు

నా పేరు ఎక్కడుంది? నాకు లంచాలు ఇవ్వడంపై బేరసారాలు జరిపినట్లు ఎక్కడ రాశారు?’... అన్న జగన్‌ ప్రశ్నకు సమాధానమే ఈ చిత్రం! అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (సెక్‌) దర్యాప్తు చేసి అక్కడి కోర్టుకు ఇచ్చిన నివేదికలో... ‘ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ మినిస్టర్‌’ అని స్పష్టంగా ప్రస్తావించింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని గౌతమ్‌ అదానీ కలిసి... ముడుపులు చెల్లించడం లేదా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సెకీతో ఒప్పందానికి ఏపీ అంగీకరించిందని అజ్యూర్‌ ప్రతినిధులకు అదానీ గ్రీన్‌ సమాచారం పంపించింది’’ అని సెక్‌ స్పష్టం చేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ మినిస్టర్‌ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా!

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశంలోనే అతితక్కువ ధరకు సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే సెకీ నుంచి సౌరవిద్యుత్తు కొనుగోలు చేసి, రాష్ట్రానికి మంచి చేస్తే శాలువా కప్పి సన్మానం చేయాలి కదా! అలా చేయకుండా నా వ్యక్తిత్వం మీద బురద జల్లడమేమిటి?’... అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విస్మయం, ఆగ్రహం, ఆక్రోశం వ్యక్తం చేశారు. అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో తన పేరెక్కడుందని ప్రశ్నించారు. తాను సంపదను సృష్టిస్తే.. ఇప్పడు ముఖ్యమంత్రి చంద్రబాబు దానిని ఆవిరి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మొట్టమొదటిసారిగా ‘అదానీ సోలార్‌ పవర్‌ డీల్‌’పై స్పందించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంచి చేసినోడిపై రాళ్లేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌లు సంతకాలు చేశాయి. ఇందులో థర్డ్‌ పార్టీ ఎక్కడుంది?’’ అంటూ అదానీ గ్రీన్‌ ఎనర్జీతో సంబంధమే లేదన్నట్లుగా జగన్‌ మాట్లాడారు. అంతేకాదు... ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను మినహాయిస్తున్నట్లు ఒప్పందంలో స్పష్టంగా ఉందన్నారు. ఇంటర్‌స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు యూనిట్‌ రూ.1.98 దాకా పడతాయని.. కానీ, అదేమీ లేకుండానే కేవలం యూనిట్‌ రూ.2.49కే విద్యుత్తును అందిస్తామని సెకీ వెల్లడించిందని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే అతి తక్కువ ధరకు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేశామని జగన్‌ తనను తాను ప్రశంసించుకున్నారు. గుజరాత్‌, రాజస్థాన్‌లో ఉన్న ధరల గురించి మాట్లాడుతున్న వాళ్లు... ట్రాన్స్‌మిషన్‌ కాస్ట్‌ మినహాయింపు గురించి ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. మంచి చేసిన తనపై బండలు వేయడమే పనిగా పెట్టుకుని ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’ కథనాలు రాస్తున్నాయంటూ ఆరోపించారు. ఈ ఒప్పందం వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని అన్నారు. ఈ ఒప్పందంలో తప్పుంటే అప్పుడే చంద్రబాబు, ‘ఆంధ్రజ్యోతి’, ‘ఈనాడు’ ఊరుకునేవా అని జగన్‌ ప్రశ్నించారు.


  • నా పేరెక్కడా లేదు...

వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీపై అమెరికాలో ఎఫ్‌బీఐ నమోదు చేసిన కేసులో తన పేరు లేదని జగన్‌ పేర్కొన్నారు. అదానీ తనకు లంచం ఇస్తానంటూ బేరాలాడినట్లు ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. ‘ఈనాడు’, ‘ఆంధ్రజ్యోతి’కి డెడ్‌లైన్‌ విధిస్తున్నానని, 48 గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని ప్రకటించారు. రిపోర్టులో ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి’ అని చాలాస్పష్టంగా ఉందికదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా... ‘‘అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు లంచాలు ఇచ్చినట్లుగా మన రాష్ట్రానికి చెందిన సీఐడీ కేసు నమోదు చేస్తే చెల్లుబాటు అవుతుందా?’ అని జగన్‌ ఎదురు ప్రశ్నించారు. ఎవరు ఎవరిపైనైనా కేసులు పెడితే చెల్లుతాయా అని జగన్‌ అన్నారు. 2020లోనే రాష్ట్రం పిలిచిన సోలార్‌ టెండర్లకు యూనిట్‌కు రూ.2.49కే వస్తుందని.. భవిష్యత్తులో ఇంకా తగ్గుతుంది కదా అని రాస్తున్నారని.. మరి ఇప్పుడు సోలార్‌ పవర్‌ యూనిట్‌ రూ.2.72కు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు.

  • అదానీతో భేటీ ఎందుకంటే...

సెకీతో ఒప్పందానికి ముందు గౌతమ్‌ అదానీతో జరిగిన భేటీలు సాధారణమైనవే అని జగన్‌ తెలిపారు. పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రిని కలవడం సహజమేనన్నారు. సెకీతో ఒప్పందానికి ముందు చాలాసార్లు.. ఒప్పందం జరిగాక కూడా ఆయన చాలాసార్లు తనను కలిశారని జగన్‌ తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 03:08 AM