ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirumala Laddu: సీబీఐతో విచారణ చేయించాలి.. గవర్నర్‌‌ను కోరిన వైఎస్ షర్మిల..

ABN, Publish Date - Sep 21 , 2024 | 08:24 PM

కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె..

YS Sharmila

అమరావతి, సెప్టెంబర్ 21: కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు. కొనుగోలు చేసిన నెయ్యి ధర నైవేద్యానికి రూ. 1,600, లడ్డూ తయారీకి మాత్రం రూ. 320 మాత్రమే ఖర్చు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రూ. 320 నెయ్యికి టెండర్ ఎలా ఖరారు చేశారని షర్మిల ప్రశ్నించారు. వారు సరఫరా చేస్తున్నది నూనె, నెయ్యి, క్రూడ్ ఆయిలా అనే ఇంగితం కూడా లేకుండా సరఫరాకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. అసలు తప్పంతా ఇక్కడే జరిగిందని అర్థమవుతోందన్నారు.


తప్పు జరిగిందని రిపోర్టులే చెబుతున్నాయి..

నివేదికల్లో వచ్చిన రిపోర్టుల ఆధారంగా తప్పు జరిగిందనేది స్పష్టమవుతోందన్నారు వైఎస్ షర్మిల. జగన్ ప్రభుత్వంలో ఉన్న సరఫరాదారులు ఇచ్చిన శాంపిల్స్‌లో తప్పు జరిగినట్లు తేలిందన్నారు. జులై 23న ఈ విషయం వెలుగులోకి వస్తే.. చంద్రబాబు నాయుడు రెండు నెలల పాటు ప్రజలకు ఎందుకు చెప్పలేదని షర్మిల ప్రశ్నించారు. ఇది భక్తికి సంబంధించిన విషయం అని.. రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ విచారణ జరిగినా అందులో రాజకీయ కోణం ఉంటుందని.. అందుకే గవర్నర్‌ను కలిసి సీబీఐ విచారణ చేయించాలని కోరామన్నారు షర్మిల.


రూ. 3 లక్షల కోట్ల ఆస్తులు ఉన్న టీటీడీ.. నెయ్యి విషయంలో ఎందుకు కక్కుర్తి పడిందో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. చంద్రబాబు కూడా జులై 23వ తేదీన రిపోర్ట్ వస్తే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఈ వ్యవహారంపై విచారణ ఎందుకు చేయించలేదో కూడా ప్రజలకు సీఎం చంద్రబాబు వివరణ ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని.. రిపోర్ట్ తెప్పించుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తన పరిధిలో తనకు వీలైనంత వరకు విచారణ చేయిస్తానని గవర్నర్ చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో ఏ టెండర్లు ఎలా వచ్చాయో అప్పటి పాలకులకు తెలియదా? అని ప్రశ్నించారు. నెయ్యి ఒక్కటే.. వేర్వేరు అవసరాలకు.. వేర్వేరు ధరలు ఎందుకు కొనుగోలు చేశారో జగన్ సమాధానం చెప్పాలన్నారు. దీనిపై ఇప్పుడు వైసీపీ నేతలు విచారణ కోరడం హాస్యాస్పందంగా ఉందన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 08:24 PM