మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Sharmila: జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?

ABN, Publish Date - Mar 21 , 2024 | 01:12 PM

ఏపీకి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని.. బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైయస్ షర్మిల అన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు మోకరిల్లారన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాయన్నారు. విభజన జరిగి పదేళ్లు అయినా ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు.

YS Sharmila: జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా?

విజయవాడ: ఏపీ (AP)కి ప్రత్యేక హోదా అనేది లేకుండా చేశారని.. బీజేపీకి ఊడిగం చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైయస్ షర్మిల (YS Sharmila) అన్నారు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు మోకరిల్లారన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాయన్నారు. విభజన జరిగి పదేళ్లు అయినా ఏపీకి రాజధాని లేదంటే సిగ్గుచేటు కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా (Special Status) విషయంలో జగనన్న ప్రజలను మోసం చేసింది వాస్తవం కాదా? అని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ (BJP) చేసిన మోసాలను ప్రజలు కూడా గమనించాలన్నారు. వాళ్లకు కొమ్ము కాస్తున్న పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు.

Bode Prasad: కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలూ లేవ్..

‘‘బొట్టు బొట్టు కలిస్తేనే మహా సముద్రమని... అడుగు అడుగు కలిస్తేనే ఉద్యమం. ఇండియా కూటమి ద్వారా కార్యాచరణ లో కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. బీజేపీతో కలిసి పని చేస్తున్న అన్ని పార్టీలను ఈ వేదిక ద్వారా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ పదేళ్ళ పాలనలో అరాచకాలు చేసింది.. భరోసా లేకుండా పోయింది. అదానీ, అంబానీలకు మాత్రం భారతదేశ సంపదను బీజేపీ దోచి పెట్టింది. మన రాష్ట్రంలోనే గంగవరం పోర్టును వాళ్లకు కట్టబెట్టారు. వైఎస్ గంగవరం పోర్టు ప్రభుత్వానికి వచ్చేలా అగ్రిమెంట్ చేశారు. కానీ జగనన్న గారు మాత్రం రూ.6500 కోట్లకు వ్యాల్యూ వేసి చీప్‌గా అదానీకి ఇచ్చేశారు. మోదీకి భయపడి జగనన్న ఇలా చాలా కౌరు చౌకగా కట్టపెట్టేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు పరం చేయడం సిగ్గు చేటు. ఇది కూడా అదానీ, అంబానీలకు కట్టబెడతారనేది బహిరంగ రహస్యం. బీజేపీ ఏది అడిగితే అది , ఏ పదవి కావాలంటే ఆ పదవి జగనన్న ఇచ్చేస్తున్నారు. రాజ్యసభ, టీటీడీ సభ్యులు, సభల్లో మద్దతు ఇలా జగనన్న ముందుంటున్నారు. రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని మద్దతు ఇస్తున్నారో అధికార, ప్రతిపక్ష పార్టీలు చెప్పగలవా?’’ అని షర్మిల ప్రశ్నించారు.

Lokesh: పెత్తందారులెవరో అర్థమవుతోందా రాజా?!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 21 , 2024 | 01:13 PM

Advertising
Advertising