AP Elections 2024: వైసీపీ అభ్యర్థికి ఊహించని షాక్..
ABN, Publish Date - Apr 27 , 2024 | 08:58 AM
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీని(YSRCP) అసంతృప్త జ్వాలలు వెంటాడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైసీపీ అభ్యర్థి శ్రీ రంగనాథ రాజుకి చేదు అనుభవం మిగిలింది. పెనుగొండ మండలం సిద్దాంతం, నక్కవారిపాలెంలో రంగనాథ రాజుకి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి వర్గం శుక్రవారం లేఖ రాసింది.
ప.గో: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీని(YSRCP) అసంతృప్త జ్వాలలు వెంటాడుతున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శ్రీ రంగనాథ రాజుకి చేదు అనుభవం మిగిలింది. పెనుగొండ మండలం సిద్దాంతం, నక్కవారిపాలెంలో రంగనాథ రాజుకి వ్యతిరేకంగా వైసీపీ అసమ్మతి వర్గం శుక్రవారం లేఖ రాసింది.
అభివృద్ధిని తుంగలో తొక్కి కాపు సంఘాలను అవమానించారంటూ కాపు నేతలు లేఖలో నిలదీశారు. కాపు కళ్యాణ మండపానికి నిధులు ఇవ్వనన్న రంగనాథకు మా సామాజిక వర్గం ఓట్లు ఎందుకు అంటూ ప్రశ్నించారు.
ఆయన కక్షపూరిత ధోరణితో అభివృద్ధికి అడ్డుపడి తమ గ్రామాలకు చేసింది ఏమీ లేదని అన్నారు. కేదారేశ్వరాలయానికి ఇసుక లారీల ద్వారా వచ్చిన రూ.2 కోట్ల ఆదాయం ఎటుపోయిందని ప్రశ్నించారు. గతస్థానిక సంస్థల ఎన్నికల్లో MPTC, పెనుగొండ సర్పంచు స్థానాలను గెలిపించలేదని అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
CBN: కూటమిదే గెలుపు
నక్కావారిపాలెంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళిన రంగరాజుపై అక్కడి ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు. వారికి సమాధానం చెప్పలేక రంగనాథ రాజు ఆయన అనుచరులు వెనుదిరిగారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Andhra Pradesh and Telugu News Here
Updated Date - Apr 27 , 2024 | 10:31 AM