AP Election 2024: చంద్రబాబు భార్య భువనేశ్వరి టార్గెట్‌గా ‘డీప్ ఫేక్’ ప్రచారం.. విషయం ఏంటంటే?
ABN, Publish Date - Apr 26 , 2024 | 05:38 PM
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని నారా లోకేశ్ ఖండించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా ఈ అంశంపై నారా లోకేశ్ స్పందించారు. సొంత చెల్లి కట్టుకున్న చీరపై కామెంట్ చేసిన సీఎం వైయస్ జగన్... నా తల్లిని వదులుతాడా? ఇంకెంత కాలం ఈ ఫేక్ ఎడిట్స్‌తో బ్రతుకుతావు జగన్? అంటూ నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.
అమరావతి, ఏప్రిల్ 26: ‘నిజం గెలవాలి’ యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్త పర్యటనలతో ఆదరణ పొందిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ అక్కసు వెళ్లగక్కుతోంది. ఎన్నికల వేళ దుష్ప్రచారానికి తెరలేపింది. డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలను ఉపయోగించి ‘దళితులను నారా భువనేశ్వరి’ దూషించినట్టుగా చిత్రించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘సొంత చెల్లి కట్టుకున్న చీరపైనే కామెంట్ చేసిన సీఎం వైయస్ జగన్... నా తల్లిని వదులుతాడా? ఇంకెంత కాలం ఈ ఫేక్ ఎడిట్స్‌తో బ్రతుకుతావు జగన్?’’ అంటూ నారా లోకేశ్ సూటిగా ప్రశ్నించారు.
AP Elections: హైదరాబాద్‌లో ఆంధ్ర ఓటర్ల కోసం.. క్యూ కడుతున్న నేతలు
కాగా దళితులను దూషించినట్లు నారా భువనేశ్వరి వాయిస్‌తో ఓ ఆడియో అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో వైసీపీ బ్యాచ్ సర్క్యూలేట్ చేస్తోంది. ఎన్నికల వేళ పలు సామాజిక వర్గాల ఓట్లను తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలనే లక్ష్యంతో ఈ తరహా కుట్రలకు తెర తీసింది.
AP Elections 2024: ఎన్నికల బరి నుంచి కొడాలి నాని ఔట్!?
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ‘నిజం గెలవాలి’ యాత్ర పేరిట సాయం చేశారు. ప్రతి కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని సైతం అందించారు.
AP Elections 2024: అవినాష్ రెడ్డి అమాయకుడంటే కడప ప్రజలను వంచించడమే:వర్లరామయ్య
ఆ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కూడా నారా భువనేశ్వరి పాల్గొనే సభలు, సమావేశాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో జగన్ పార్టీ అబద్దపు ప్రచారానికి తెర తీసింది. అందులోభాగంగా చంద్రబాబు సతీమణి.. దళితులను దూషించారంటూ ఓ ఆడియోను వదిలారనే చర్చ సాగుతోంది.
KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నా వల్లే ఆగింది.. కేఏ పాల్ సంచలనం..!!
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వైయస్ షర్మిల బాధ్యతలు చేపట్టారు. అనంతరం వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌కి, ఆయన సోదరి వైయస్ షర్మిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. అయితే తన కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహ వేడుకకు ఆహ్వానించేందుకు పసుపు చీర ధరించి వైయస్ షర్మిల.. నారా చంద్రబాబు నాయుడి నివాసానికి వెళ్లారు.
Lok Sabha Polls 2024: వీవీప్యాట్ల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై ఎన్నికల సభలో మోదీ స్పందన
అయితే సీఎం వైయస్ జగన్ తన ఎన్నికల ప్రచారంలో వైయస్ షర్మిల పసుపు చీర కట్టుకుని చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ ఫోటోను వైయస్ జగన్ తన ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. దీనిపై వైయస్ షర్మిల తనదైన శైలిలో సోదరుడు వైయస్ జగన్‌కు కౌంటర్ ఇచ్చారు. అటువంటి పరిస్థితుల్లో నారా లోకేశ్ తనదైన శైలిలో స్పందించారు. సొంత చెల్లి కట్టుకున్న చీరపైనే వైయస్ జగన్ కామెంట్ చేశారు. అలాంటి జగన్.. నా తల్లిని సైతం వదులుతాడా? అంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Read National News and Telugu News
Updated Date - Apr 26 , 2024 | 06:51 PM