ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:14 PM

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు.!

విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ (స్థానిక సంస్థల కోటా) స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botcha Satyanarayana) ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కాస్త ఎమ్మెల్సీ బొత్స అయ్యారు.! ఏపీ సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నిక కావడం.. ఇందులో వైసీపీ గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి.

బొత్స ఇంట్రెస్టింగ్ కామెంట్స్


పరిశీలన ఇలా..!

కాగా.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం రిటర్నింగ్‌ అధికారి, విశాఖపట్నం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మయూర్‌ అశోక్‌ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరిగింది. నామినేషన్ల పరిశీలన కార్యక్రమానికి స్వతంత్య్ర అభ్యర్థి షేక్‌ షఫీ, వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తరపున ఆయన ప్రతినిధులు హాజరయ్యారు. అన్ని పత్రాలు ఉండడంతో రెండు నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది.


అధికారికంగా..!

స్వతంత్య్ర అభ్యర్థి షేక్‌ షఫీ తాను నామినేషన్‌ ఉపసంహరించుకున్నట్టు బుధవారమే పత్రాలు దాఖలు చేశారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఒక్కరే బరిలో ఉన్నట్టు అయ్యింది. అయినప్పటికీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాతే అధికారికంగా బొత్స సత్యనారాయణ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది. దీంతో శుక్రవారం నాడు సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చేసింది. కాగా.. ఎన్నిక ఏకగ్రీవం కావడంతో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల తరువాత కోడ్‌ తొలగిపోయింది. ఈ విషయాన్ని రిటర్నింగ్‌ అధికారి మయూర్‌ అశోక్‌ వెల్లడించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని కూటమి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.


గరంగరంగా ఉన్నా.. వర్కవుట్!

వాస్తవానికి.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఖరారు చేయడంపై ఉమ్మడి విశాఖలోని వైసీపీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తే వచ్చింది. పార్టీ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్‌ బయటకు వెళ్లిపోవడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం కోసం ఎంతోమంది కాచుకు కూర్చున్నారు. సాధారణ ఎన్నికల్లో అవకాశం కల్పించలేకపోయిన వారికి ఇస్తారని కోలా గురువులు వంటి నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని విధంగా పార్టీ అభ్యర్థులంతా ఓడిపోవడంతో అందరి కళ్లు శాసన మండలిపై పడ్డాయి. ఎలాగైనా అధికారంలో కొనసాగాలనే తాపత్రయంతో మొన్నటివరకు అధికారం అనుభవించిన వారంతా ఈ ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశించారు. కానీ ఊహించని విధంగా పక్క జిల్లా నాయకుడు బొత్సను అభ్యర్థిగా ప్రకటించడంతో అంతా కంగుతిన్నారు. పొరుగు జిల్లాకు చెందిన నాయకుడిని తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దింపడం ఏమిటంటూ రుసరుసలలాడుతున్నారు. అసలు...ఈ టికెట్‌ బొత్సకు ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆయన పోటీలో ఉన్నారనే విషయం కూడా ఎక్కడా బయటకు పొక్కలేదు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే. ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చింది మొదలుకుని నామినేషన్, ఏకగ్రీవం అయినంత వరకూ ఎక్కడా పొరపచ్చాలు లేకుండా అన్నీ తానై అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూసుకున్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

Updated Date - Aug 16 , 2024 | 10:20 PM

Advertising
Advertising
<