రూ.35 కోట్ల బుగాటీ టూర్‌బిల్లాన్
ABN , Publish Date - Jun 22 , 2024 | 04:08 AM
అలా్ట్ర లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బుగాటీ సరికొత్త కారును ఆవిష్కరించింది. దానిపేరు టూర్‌బిల్లాన్. ధరెంతో తెలుసా.. 38 లక్షల యూరోలు.
మన కరెన్సీలో రూ.35 కోట్ల పైమాటే. ఎందుకంత రేటు అంటారా..? దాని ప్రత్యేకతలు అలాంటివి మరి. 8.3 లీటర్, వీ 16 ఇంజన్‌తో కూడిన ఈ మెగా కార్.. ఒక మెగావాట్‌కు పైగా పవర్‌ను ఉత్పత్తి చేయగలదు. అంతేకాదు, సున్నా నుంచి గంటకు 100 కి.మీ వేగాన్ని కేవలం 2 సెకన్లలో అందుకోగలదని కంపెనీ తెలిపింది. 5 సెకన్లలో 200 కి.మీ, 10 సెకన్లలో 300 కి.మీ, 25 సెకన్ల లోగా 400 కి.మీ వేగాన్ని అందుకుంటుందని బుగాటీ వెల్లడించింది. గంటకు 445 కి.మీ గరిష్ఠ వేగంతో దూసుకెళ్లగలదు. కేవలం 250 టూర్‌బిల్లాన్‌లను మాత్రమే తయారు చేయనున్నట్లు బుగాటీ తెలిపింది.