PPF Account: ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఇలా యాక్టివేట్ చేసుకోండి..
ABN , Publish Date - Nov 08 , 2024 | 01:38 PM
మీరు మీ పీపీఎఫ్ ఖాతాను అనేక సంవత్సరాల నుంచి ఉపయోగించడం లేదా అయినా కూడా నో ప్రాబ్లమ్. అయితే అందుకోసం ఏం చేయాలి. ఆ ఖాతాను యాక్టివేట్ చేసుకోవాలంటే ఎంత మొత్తంలో కట్టాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు అనేక రోజులుగా మీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతాను వినియోగించడం లేదా, దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఇక్కడ ఉపయోగించని మీ పీపీఎఫ్ ఖాతాను ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చనే విషయాలను తెలుసుకుందాం. నిబంధనల ప్రకారం పీపీఎఫ్ ఖాతాదారుడు ఏడాదిలో కనీసం రూ. 500 పీపీఎఫ్ ఖాతాలో డిపాజిట్ చేయాలి. కానీ ఎవరైనా వినియోగదారులు ఆ సంవత్సరంలో ఈ కనీస మొత్తాన్ని కూడా డిపాజిట్ చేయనప్పుడు ఆ PPF ఖాతా వినియోగించని కేటగిరీలో చేర్చబడుతుంది.
జరిమానా విధింపు
పీపీఎఫ్ అనేది భారత ప్రభుత్వ దీర్ఘకాలిక పొదుపు పథకం. ఈ స్కీం మెచ్యూరిటీ వ్యవధి 15 సంవత్సరాలు. ఇన్‌యాక్టివ్‌గా ఉన్న PPF ఖాతాను మళ్లీ యాక్టివేట్ చేయడానికి ఖాతాదారుడు ప్రతి సంవత్సరం రూ. 500 డిపాజిట్‌తో పాటు బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు వ్రాతపూర్వక అభ్యర్థనను సమర్పించాలి. అలాగే ఉపయోగించని ప్రతి సంవత్సరానికి రూ. 50 జరిమానా చెల్లించాలి.
పీపీఎఫ్ ఎందుకు అలా అవుతుంది
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం ఒక ఖాతాదారుడు సంవత్సరంలో కనీసం రూ. 500 PPFలో డిపాజిట్ చేయాలి. వినియోగదారుడు ఆ సంవత్సరంలో ఈ కనీస మొత్తాన్ని కూడా డిపాజిట్ చేయనప్పుడు, PPF ఖాతా ఉపయోగించని కేటగిరీలో చేర్చబడుతుంది. అంటే మీ PPF ఖాతా ఇప్పుడు యాక్టివ్‌గా ఉండదు. అప్పుడు మీ PPF ఖాతా ఒక ఆర్థిక సంవత్సరానికి పైగా నిష్క్రియంగా ఉంటే దాన్ని పునరుద్ధరించడానికి బ్యాంక్ లేదా పోస్టాఫీసు మీకు రూ. 50 జరిమానా విధిస్తుంది.
ఈ స్కీం ఉపయోగాలు
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లేదా PPF అనేది పెట్టుబడిదారులకు ఒక స్థిరమైన ఆదాయ పెట్టుబడి ఎంపిక. PPF ఖాతాలో ప్రతి సంవత్సరం గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును కూడా పొందవచ్చు. ఈ ఖాతా చెల్లుబాటు వ్యవధి 15 సంవత్సరాలు. ఈ ఖాతాదారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. ఈ పథకం కింద రుణం తీసుకునే సౌకర్యం మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఆర్థిక సంవత్సరం వరకు అందుబాటులో ఉంటుంది. ఏడో ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం విత్‌డ్రాలను అనుమతిస్తారు. మెచ్యూరిటీ తర్వాత అదనపు డిపాజిట్లతో 5 సంవత్సరాలపాటు PPF ఖాతాను ఎన్ని సంవత్సరాలకైనా పొడిగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Life Certificate 2024: మీ పెన్షన్ ఆగకుడదంటే ఇలా చేయండి.. కొన్ని రోజులే గడువు..
Stock Markets: పెట్టుబడిదారులకు షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ ఎంత నష్టపోయాయంటే..
Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..
Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..
Read More Business News and Latest Telugu News