Sensex: ఎగ్జిట్ పోల్ తర్వాత సెన్సెక్స్ టార్గెట్ 80,000..చేరుకుంటుందా?
ABN , Publish Date - Jun 02 , 2024 | 11:04 AM
ఇటీవల ఇచ్చిన లోక్‌సభ 2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్(exit polls) రేపు (జూన్ 3న) సోమవారం భారత స్టాక్ మార్కెట్(stock market) సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపాయి.
ఇటీవల ఇచ్చిన లోక్‌సభ 2024 ఎన్నికల ఎగ్జిట్ పోల్స్(exit polls) రేపు (జూన్ 3న) సోమవారం భారత స్టాక్ మార్కెట్(stock market) సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపాయి. దీంతో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితం రావడంతో గ్లోబల్, దేశీయ మార్కెట్ సూచీలు పైపైకి వెళతాయని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్(sensex) క్రమంగా 78,100 నుంచి 79,950, 80,000 స్థాయిల వరకు ర్యాలీ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. BSE బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 8 శాతం కంటే ఎక్కువ అప్‌సైడ్ వెళ్లే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక శుక్రవారం(మే 31న) సెన్సెక్స్ చివరి ముగింపు స్థాయి 73,961గా ఉంది. మరోవైపు ఎన్నికల ఫలితాలకు ముందు విదేశీ పెట్టుబడులు వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నాయని, అయినప్పటికీ భారతీయ మార్కెట్ చాలా బలంగా ఉందని నిపుణులు అన్నారు.
గత వారం మే 27, 2024 సోమవారం నాడు రికార్డుల గరిష్ట స్థాయిలను స్కేలింగ్ చేసిన తర్వాత ఈక్విటీ బెంచ్‌మార్క్(stock market) సూచీలు కొంచెం తగ్గాయి. BSE సెన్సెక్స్ గరిష్టంగా 76,010 స్థాయిలను తాకింది. చివరికి వారం 2.5 శాతం లేదా 2,049 పాయింట్లు తగ్గి 73,961 స్థాయిల వద్ద ముగిసింది. అదేవిధంగా NSE నిఫ్టీ 50 ఇండెక్స్ 23,111 వద్ద ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. వారంలో 2.7 శాతం లేదా 580 పాయింట్ల నష్టంతో 22,531 వద్దకు చేరుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 250 సూచీలు వాటి రికార్డు గరిష్టాల నుంచి వరుసగా 3 శాతం, 2.3 శాతం సరిదిద్దబడ్డాయి. బ్యాంక్ నిఫ్టీ కొత్త శిఖరాన్ని స్కేల్ చేయనప్పటికీ మొత్తం మార్కెట్‌ను అధిగమించగలిగింది.
ఇది కూడా చదవండి:
గత నెల జీఎస్‌టీ ఆదాయం రూ.1.73 లక్షల కోట్లు
CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు
Read Latest Business News and Telugu News