Paytm: పేటీఎం వాడుతున్నారా.. మీ ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలున్నాయ్
ABN , Publish Date - Feb 17 , 2024 | 01:52 PM
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు.
ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నుంచి Paytmకి తాత్కాలిక ఉపశమనం లభించిన విషయం తెలిసిందే. Paytm పేమెంట్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలు మార్చి 15 వరకు మరో పొడిగిస్తున్నట్లు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది. అంతకుముందు పరిమితులకు గడువు ఫిబ్రవరి 29గా ప్రకటించారు. జనవరి 31న Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన కఠినమైన ఆంక్షల గురించి ప్రజల ప్రశ్నల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో కస్టమర్లు మార్చి వరకు డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు, ప్రీపెయిడ్ సేవలు, వాలెట్లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు చేయవచ్చని RBI తెలిపింది. Paytm QR, సౌండ్‌బాక్స్, EDC (కార్డ్ మెషీన్) మార్చి 15 తర్వాత కూడా ఎప్పటిలాగే పని చేస్తాయని పేటీఎం ఎండీ విజయ్ శేఖర్ శర్మ శుక్రవారం Xలో పేర్కొన్నారు. ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాల కోసం ప్రజలు గూగుల్ చేస్తున్నారు. వీటికి ఆర్బీఐ FAQ రూపంలో ప్రశ్నలు - జవాబుల జాబితా విడుదల చేసింది.
ప్రశ్న: మార్చి 15, 2024 తర్వాత కూడా Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నుండి డబ్బు తీసుకోవచ్చా? Paytm డెబిట్ కార్డ్ ఉపయోగించడాన్ని కొనసాగించవచ్చా?
జ: అవును, మీరు గడువు తరువాత కూడా డెబిట్ కార్డ్‌ని మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ వరకు ఉపయోగించవచ్చు.
ప్రశ్న: మార్చి 15 తర్వాత Paytm పేమెంట్స్ బ్యాంక్ సేవింగ్స్ లేదా అకౌంట్లో డబ్బులు వేయవచ్చా?
జ: లేదు.. మార్చి 15 తర్వాత డబ్బులు వేయలేరు. వడ్డీ, క్యాష్‌బ్యాక్‌లు, పార్ట్నర్ బ్యాంకుల నుంచి స్వీప్-ఇన్లు లేదా రీఫండ్లు మాత్రమే క్రెడిట్ చేయడానికి అనుమతి ఉంటుంది.
ప్రశ్న: గడువు తరువాత రీఫండ్‌ని ఆశిస్తే ఏమవుతుంది?
జ: ఆ తర్వాత కూడా రీఫండ్లు, క్యాష్‌బ్యాక్ పొందుతారు.
ప్రశ్న: స్వీప్-ఇన్/అవుట్ల ద్వారా పార్ట్నర్ బ్యాంకుల్లో డిపాజిట్ల గురించి?
జ: పార్ట్నర్ బ్యాంక్‌ల నుండి డిపాజిట్లను Paytm పేమెంట్స్ బ్యాంక్‌కు బదిలీ చేసుకోవచ్చు. అయితే మార్చి 15 తర్వాత పార్టనర్ బ్యాంక్‌లతో కొత్త డిపాజిట్లు అనుమతించవు.
ప్రశ్న: గడువు తర్వాత Paytm అకౌంట్లో జీతం పొందవచ్చా?
జ: లేదు.. మార్చి 15 లోపే మీ జీతం అందుకోగలరు.
ప్రశ్న: మార్చి 15 తర్వాత కూడా Paytm ఖాతాలో ప్రభుత్వ రాయితీలు లేదా ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకాలను పొందవచ్చా?
జ: లేదు.. మార్చి 15 లోపు లింక్ అయిన అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కి మార్చాల్సి ఉంటుంది.
ప్రశ్న: ఆటోమేటిక్ విద్యుత్ బిల్లుల చెల్లింపులు కొనసాగుతాయా?
జ: మీ ఖాతాలో డబ్బు ఉండే వరకు ఆటోమేటిక్ బిల్లు చెల్లింపులు కొనసాగుతాయి. అయితే గడువు పూర్తయ్యేలోపు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలి.
ప్రశ్న: మార్చి 15 తర్వాత Paytm అకౌంట్ నుండి UPI ద్వారా ఆటోమేటిక్ OTT సబ్స్క్రిప్షన్ చెల్లింపులు జరుగుతాయా?
జ: బ్యాలెన్స్ ఉండే వరకు అవి కొనసాగుతాయి. మార్చి 15లోపు ప్రత్యామ్నయ మార్గాలు చూసుకోవాలి.
ప్రశ్న: మార్చి 15 తర్వాత కూడా Paytm పేమెంట్స్ బ్యాంక్ ఖాతా నుండి లోన్ EMIలు ఆటోమేటిక్‌గా చెల్లించవచ్చా?
జ: ఖాతాలో డబ్బు ఉన్నంత వరకు అవి కొనసాగుతాయి, అయితే మార్చి 15 లోపు మరొక బ్యాంక్ ద్వారా చెల్లింపులు జరిగేటట్లు సెట్ చేసుకోవాలి.
ప్రశ్న: మార్చి 15 తర్వాత కూడా Paytm పేమెంట్స్ బ్యాంక్ వాలెట్లోని డబ్బులను ఉపయోగించవచ్చా?
జ: అవును, వాలెట్లోని డబ్బులను నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. లేదా మరొక వాలెట్ లేదా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయవచ్చు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి