Share News

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:42 PM

ప్రతి నెల మాదిరిగానే ఈసారి కూడా బ్యాంక్ సెలవుల జాబితా వచ్చేసింది. అయితే ఈసారి డిసెంబర్ నెలలో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
December 2024 bank holidays

నవంబర్ తర్వాత ఇప్పుడు డిసెంబర్ నెల మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ప్రతి నెలలాగే ఈసారి కూడా బ్యాంకులకు సెలవులు (bank holidays) వచ్చాయి. ఈ చివరి నెలలో పండుగలకు సంబంధం లేకపోయినా, చాలా ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం డిసెంబరు నెలలో వివిధ రాష్ట్రాల్లో 17 రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, సకాలంలో పూర్తి చేసుకోండి. లేకుంటే మీరు సమస్యలను ఎదుర్కొవచ్చు. ఈ సెలవులు ఏకరీతిగా లేనప్పటికీ, అవి వివిధ రకాలుగా నిర్ణయించబడ్డాయి.


సెలవుల క్యాలెండర్‌

అయితే ఏ రాష్ట్రంలో బ్యాంకులు ఎప్పుడు, ఎందుకు మూతపడతాయనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. RBI ప్రతి నెలా అన్ని బ్యాంకులకు సెలవు క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది. డిసెంబరులో గురు ఘాసిదాస్ జయంతి, గురు తేజ్ బహదూర్ బలిదాన దినోత్సవం, మానవ హక్కుల దినోత్సవం, గోవా విమోచన దినోత్సవం సందర్భంగా బ్యాంకులు మూసివేయబడతాయి. దీంతోపాటు రెండో, చివరి శని, ఆదివారాలతో కలిపి ఈ నెలలో 17 రోజులు బ్యాంకులకు సెలవు రావడం విశేషం. ఆయా రాష్ట్రాలను బట్టి ఈ సెలవులు మారుతుంటాయి.


డిసెంబరు 2024లో బ్యాంకు సెలవుల జాబితా

  • డిసెంబర్ 1న ఆదివారం - (ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం) దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 3న మంగళవారం - (సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ డే) గోవాలో బ్యాంకులకు హాలిడే

  • డిసెంబర్ 8న ఆదివారం - వారాంతపు సెలవు

  • డిసెంబర్ 10న మంగళవారం - (మానవ హక్కుల దినోత్సవం) దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 11న బుధవారం - (UNICEF పుట్టినరోజు) అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 14న శనివారం - అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 15న ఆదివారం - వారపు సెలవు

  • డిసెంబర్ 18న బుధవారం - (గురు ఘాసిదాస్ జయంతి) చండీగఢ్‌లో బ్యాంకులకు హాలిడే


  • డిసెంబర్ 19న గురువారం - (గోవా విమోచన దినోత్సవం) గోవాలో బ్యాంకులు బంద్

  • డిసెంబర్ 22న ఆదివారం - వారపు సెలవు

  • డిసెంబర్ 24న మంగళవారం - (గురు తేగ్ బహదూర్ బలిదానం రోజు, క్రిస్మస్ ఈవ్) మిజోరం, మేఘాలయ, పంజాబ్, చండీగఢ్‌లలో బ్యాంకులు బంద్

  • డిసెంబర్ 25న బుధవారం - (క్రిస్మస్) అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 26న గురువారం - (బాక్సింగ్ డే, క్వాంజా) అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 28న శనివారం - నాల్గో శనివారం, అన్ని బ్యాంకులకు సెలవు

  • డిసెంబర్ 29న ఆదివారం - వారపు సెలవు

  • డిసెంబర్ 30న సోమవారం - (తము లోసార్ సందర్భంగా) సిక్కింలో బ్యాంకులకు హాలిడే

  • డిసెంబర్ 31న మంగళవారం – (నూతన సంవత్సర వేడుక) మిజోరంలో బ్యాంకులు బంద్


ఇవి కూడా చదవండి:

Adani Group: గౌతమ్ అదానీకి మరో దెబ్బ.. విదేశీ సంస్థ వేల కోట్ల డీల్ రద్దు


Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Aadit Palicha: చదువు, జాబ్ వదిలేసి స్టార్టప్ పెట్టాడు.. ఇప్పుడు రూ.4300 కోట్ల సంపదకు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 22 , 2024 | 12:44 PM