Heatwave: హీట్‌వేవ్ ఎఫెక్ట్..పెరుగుతున్న కూరగాయల ధరలు, ద్రవ్యోల్బణంపై కూడా
ABN , Publish Date - May 02 , 2024 | 11:13 AM
రోజురోజుకు ఎండలు(Heatwave) మండిపోతున్నాయి. జనాలు బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో పెరుగుతున్న వేడితో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలపై మరో భారం పడుతోంది. ఎండల కారణంగా మార్కెట్‌లో కూరగాయల(Vegetables) దిగుమతులు కూడా తగ్గిపోతున్నాయి.

బయటి నుంచి వచ్చే కూరగాయలు హైదరాబాద్(hyderabad) సహా అనేక ప్రాంతాలకు రావడం తగ్గిపోయాయి. హీట్‌వేవ్ కారణంగా వ్యాపారులు కూరగాయలను ఎక్కడికక్కడే సేల్ చేస్తున్నారు. దీంతో మార్కెట్‌పై కూరగాయల కొరత ఏర్పడుతుంది. ఈ క్రమంలో టమోటాలు, ఉల్లి దిగుమతి భారీగా తగ్గింది. ప్రస్తుతం మార్కెట్‌లో కూరగాయల దిగుమతి 60 శాతం తగ్గిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఈ క్రమంలో అనేక చోట్ల కూరగాయల ధరలు(prices) కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఎండ తీవ్రత ఇలాగే కొనసాగితే జూన్ వరకు మార్కెట్‌లో కూరగాయల కొరత ఏర్పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇతర ప్రాంతాల రైతుల నుంచి కూరగాయలు రావడం ఇలాగే ఆగిపోతే హైదరాబాద్ నగరంతోపాటు అనేక చోట్ల కూరగాయల ధరలు మరింత పెరిగిపోతాయని అంటున్నారు.
ఇది ఒక్క హైదరాబాద్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా(india) అనేక చోట్ల ఇదే పరిస్థితి నెలకొందని నిపుణులు అంటున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మరికొన్ని రోజుల్లో కూరగాయల ధరలు ఇంకా పెరిగితే వంటగది బడ్జెట్ మరింత పెరగనుందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మరోవైపు కూరగాయల ధరలు ఇలాగే పెరిగితే ద్రవ్యోల్బణంపై కూడా ప్రభావం చూపనుంది.
ఇది కూడా చదవండి:
IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్ ప్రయాణం
Abhibus : ఓటర్ల కోసం అభిబస్ ప్రత్యేక ఆఫర్
Read Latest Business News and Telugu News