Share News

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

ABN , Publish Date - Oct 30 , 2024 | 08:41 AM

దలాల్ స్ట్రీట్‌లో ఓ స్మాల్‌క్యాప్ స్టాక్ చరిత్ర సృష్టించింది. ఒక్క రోజులోనే ఈ షేర్ ధర లక్షల రూపాయలు పెరిగింది. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు చేసిన వారి సంపద ఆమాంతం పుంజుకుంది. రాత్రికి రాత్రే పెట్టుబడిదారుల అదృష్టాన్ని మార్చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్
Penny Stock updates

ప్రస్తుత రోజుల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ మనీ రిటర్న్స్ వస్తున్నాయంటే ఎవ్వరికైనా కూడా ఆసక్తి ఉంటుంది. ఏ మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చాయి లేదా స్టాక్ మార్కెట్లో(stock markets) వచ్చాయా అని తెలుసుకుంటారు. కానీ ఓ కంపెనీ స్టాక్ ధర మాత్రం కేవలం నాలుగు నెలల్లోనే రూ. 3.53 (జూన్ 21, 2024న) నుంచి రూ. 2,36,250కి (అక్టోబర్ 29, 2024) పెరగడం విశేషం. ఈ స్టాక్ ధర 66,92,535% జంప్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఖరీదైన స్టాక్‌గా ఉన్న MRF కంపెనీని (రూ. 1,22,345.60) ఇది అధిగమించింది.


ఒక్క రోజులోనే

సెబీ సర్క్యూలర్ ప్రకారం ఎల్సిడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (Elcid Investments Ltd) కంపెనీ అక్టోబరు 29న రూ. 2.25 లక్షలతో ట్రేడింగ్ ప్రారంభించింది. అక్టోబర్ 29న BSEలో MRF షేర్లు 0.61% పడిపోయి రూ.1.22 లక్షలకు చేరుకున్నాయి. ఇదే సమయంలో ఆశ్చర్యకరంగా ఆల్సిడ్ కంపెనీ షేర్లు అత్యధికంగా ట్రేడైన ధర రూ. 4.58 లక్షలు కావడం విశేషం. అంటే ఈ కంపెనీ షేర్లు ఒక్క రోజులోనే లక్షల రేట్లు పెరిగాయి.


నాలుగు నెలల్లో

ఈ లెక్కన ఈ కంపెనీ స్టాక్‌లో నాలుగు నెలల క్రితం లక్ష రూపాయల పెట్టుబడిని దీర్ఘకాలంలో పెట్టి ఉంటే, అది నేటికి రూ. 670 కోట్లు అయ్యేది. ఇది తెలిసిన అనేక మంది మదుపర్లు తాము మిస్సయ్యామని పలువురు అనుకుంటుండగా, ఈ కంపెనీ షేర్లలో దీర్ఘకాలంలో పెట్టుబడులు చేసిన వారు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆల్సైడ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ షేర్ల భారీ మార్పు గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ కంపెనీ స్టాక్ ధర ఇంత భారీగా పెరుగుతుందని ఊహించలేదని మదుపర్లు కామెంట్లు చేస్తున్నారు.


ఈ కంపెనీ ప్రధాన ఆదాయం

జూన్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం రూ. 135.95 కోట్లుగా ఉంది. ఇది జూన్ 2023లో రూ. 97.41 కోట్ల కంటే 39.57% ఎక్కువ. జూన్ 2024లో నికర అమ్మకాలు రూ. 177.53 కోట్లు, జూన్ 2023లో రూ.128.38 కోట్ల నుంచి 38.28% పెరిగాయి. ఆల్సైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ కేటగిరీ కింద ఆర్‌బీఐతో రిజిస్టర్ అయిన ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీ. ప్రస్తుతం ఎలాంటి వ్యాపారం చేయదు, కానీ ఏషియన్ పెయింట్స్ వంటి ఇతర పెద్ద కంపెనీలలో పెద్ద పెట్టుబడులను కలిగి ఉంది. ఈ సంస్థ ప్రధాన ఆదాయ వనరు దాని హోల్డింగ్ కంపెనీల నుంచి పొందిన డివిడెండ్లు మాత్రమే. ఈ కంపెనీ రూ. 11,000 కోట్లకు పైగా పెట్టుబడులను కలిగి ఉంది.


ఇవి కూడా చదవండి:

Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..

Pension Plan: రోజూ రూ. 12 ఆదా చేస్తే.. 60 ఏళ్ల తర్వాత నెలకు ఎంత పెన్షన్ వస్తుందంటే..

Muhurat Trading 2024: ఈసారి దీపావళి ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే.. అక్టోబర్ 31 లేదా నవంబర్ 1..


Read More Business News and Latest Telugu News


Updated Date - Oct 30 , 2024 | 10:30 AM