IRCTC: రైల్వే టికెట్ యూజర్లకు షాకిచ్చిన ఐఆర్‌సీటీసీ.. కానీ ఇప్పుడు
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:48 PM
ఇండియన్ రైల్వే టికెటింగ్ వెబ్‌సైట్, యాప్ సర్వర్ ఈరోజు ఉదయం మళ్లీ డౌన్ అయ్యింది. దీంతో లక్షలాది మంది ఆందోళన చెందారు. ఈ క్రమంలో రైల్వే టిక్కెట్‌లు బుక్ కావడం లేదని అనేక మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.

ఇండియన్ రైల్వే టికెటింగ్ సేవలు నేడు ఉదయం కొన్ని గంటలు పనిచేయకుండా ఆగిపోయాయి. దీంతో ఈరోజు ఉదయం IRCTC (Indian Railway Catering and Tourism Corporation) వెబ్‌సైట్, మొబైల్ యాప్ సర్వర్లు పనిచేయడం లేదని ప్రయాణికులు తెలిపారు. ఈ క్రమంలో లక్షలాది ప్రయాణికులు ఆందోళన చెదారు. ప్రత్యేకంగా రైల్వే టికెట్లను బుక్ చేయాలనుకున్న వారు, ఆన్‌లైన్ టికెటింగ్ సేవలు పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కారణమిదేనా..
IRCTC తన వెబ్‌సైట్‌పై ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ సమస్య గురించి వివరణ ఇచ్చింది. "మెయింటెనెన్స్ యాక్టివిటీ కారణంగా ప్రస్తుతం టికెటింగ్ సేవలు అందుబాటులో ఉండవని ప్రకటించింది. ఇది ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం కలిగిస్తున్న విషయమని తెలిపింది. ఈ విఘాతం కారణంగా ప్రయాణికులు తమ టికెట్లు బుక్ చేయలేకపోతున్నారు. దీంతో పాటు, ప్రయాణికులకు ఏ ఇతర సమాచారం అవసరమైనా కూడా IRCTC వారు మరికొన్ని ఫోన్ నంబర్లు, ఇమెయిల్ అడ్రసులను అందించారు. వారు చెప్పినట్లుగా, టికెట్ లేదా TDR (Ticket Deposit Receipt) సమస్యలు ఉన్న ప్రయాణికులు ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేయవచ్చని స్పష్టం చేశారు.
14646
08044647999
08035734999
అలాగే కస్టమర్లు ఈ ఇమెయిల్ (https://equery.irctc.co.in) అడ్రసులకు కూడా మెయిల్ చేయవచ్చని సూచించారు.
ప్రస్తుతం మాత్రం..
ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే ఆన్‌లైన్ రైల్వే టికెటింగ్ పద్ధతుల్లోని వెబ్, యాప్ రెండూ కూడా ఉదయం వేళలో పనిచేయలేదు. కానీ ప్రస్తుతం IRCTC వెబ్‌సైట్ పనిచేస్తుంది. ఈ సమస్యను అధికారులు పరిష్కరించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకై ఏదైనా అనుమానాలు ఉంటే IRCTC అధికారిక కస్టమర్ కేర్ నంబర్ల ద్వారా సమాచారం పొందాలని సూచించారు. వ్యక్తిగత ప్రయాణాల కోసం వేల సంఖ్యలో సర్వీస్‌లు అవసరమైనప్పుడు ఇలాంటి టెక్నికల్ సమస్యలు ఏర్పడుతాయని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Read More Business News and Latest Telugu News