New Rules: కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే.. నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం తప్పదు
ABN , Publish Date - Dec 30 , 2024 | 08:04 AM
ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనలు మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ కాకపోతే ..
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కేవలం క్యాలెండర్‌తో తేదీ మాత్రమే మారుతుందనుకుంటే పొరపాటు పడినట్లే. క్యాలెండర్‌లో తేదీతో పాటు కొన్నింటికి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. ఉదయం లేవడం మొదలు రాత్రి నిద్రపోయే వరకు జీవితంలోని వివిధ అంశాలను ఈ మార్పులు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కొన్ని నిబంధనలు మార్పు వ్యక్తి యొక్క బడ్జెట్‌పై ప్రభావం చూపిస్తుంది. కొత్త రూల్స్ తెలుసుకోవడం వలన మీ ఆర్థిక వ్యవహారాలను, బడ్జెట్‌ను సమర్థవంతంగా నిర్వహించుకునే వీలుంటుంది. ఈ మార్పులకు అనుగుణంగా అప్‌డేట్ కాకపోతే భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. అసలు 2025లో ఏయే రంగాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనేది తెలుసుకుందాం.
వంట గ్యాస్ ధర
వంటగ్యాస్ (ఎల్‌పిజి) ధరలు ప్రతినెలా ఒకటో తేదీన సవరిస్తారు. కొత్త ఆంగ్ల సంవత్సరంలో 2025 జనవరి 1న చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరల్లో ఏమైనా మార్పులు చేస్తాయో లేదో చూడాలి.
GST నియమాలలో కీలక మార్పులు
2025 బజనవరి 1 నుంచి కొత్త GST నియమాలు అమలులోకి వస్తాయి. ఈ కొత్త రూల్స్ దేశంలోని వ్యాపారాలపై ప్రభావం చూ'పిస్తాయి.
UPI 123చెల్లింపు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) 2025 జనవరి నుంచి UPI 123Pay పరిమితిని పెంచనుంది. ఇప్పటి వరకు, మీరు ఈ చెల్లింపు సేవను ఉపయోగించి రూ. 5,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. అయితే ఇక నుంచి ఈ పరిమితిని రూ.10వేలకు పెరగనుంది.
తప్పనిసరి MFA (మల్టీ-ఫాక్టర్ అథెంటికేషన్)
GST పోర్టల్‌లో భద్రతను మెరుగుపరచడానికి, పన్ను చెల్లింపుదారులందరికీ MFA అవసరం. OTPల కోసం మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయడం, మీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది.
ఈపీఎఫ్‌వోపై బిగ్ రిలీఫ్
కొత్త సంవత్సరంలో ఈపీఎఫ్వోపెన్షన్ హోల్డర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది. కొత్త నిబంధనల ప్రకారం, పెన్షన్ హోల్డర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంకు నుండి అయినా ఎటువంటి అదనపు ధృవీకరణ అవసరం లేకుండా విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఎల్‌పిజి ధరలు, యూపీఐ 123 లావాదేవీలు, ఈపీఎఫ్‌వో మార్పులు సామాన్యులకు సంబంధించిన విషయాలు కాగా.. జీఎస్టీ, మల్లీ ఫాక్టర్ అథెంటికేషన్ వ్యాపారస్తులకు సంబంధించినవి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here