Share News

Mukesh Ambani: ఐదేళ్ల నుంచి జీతం లేకుండా పనిచేస్తున్న ముఖేష్ అంబానీ.. మరి ఖర్చులకు ఎలా?

ABN , Publish Date - Aug 07 , 2024 | 05:52 PM

ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అయితే వేలకోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ మాత్రం గత ఐదేళ్లుగా జీతం ఒక్క రూపాయి(zero salary) కూడా తీసుకోవడం లేదు. అయితే ముఖేష్ జీతం తీసుకోకుండా, షేర్లు అమ్మకుండా ఉంటే తమ ఖర్చులను ఎలా నిర్వహిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా నిర్వహిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

Mukesh Ambani: ఐదేళ్ల నుంచి జీతం లేకుండా పనిచేస్తున్న ముఖేష్ అంబానీ.. మరి ఖర్చులకు ఎలా?
Mukesh Ambani

ఆసియాలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ(Mukesh Ambani) ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు. అయితే వేలకోట్ల ఆస్తులున్న ముఖేష్ అంబానీ మాత్రం గత ఐదేళ్లుగా జీతం ఒక్క రూపాయి(zero salary) కూడా తీసుకోవడం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటివల వార్షిక నివేదికలో కోవిడ్ సమయం నుంచి కంపెనీ ఛైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ ఎలాంటి వేతనం తీసుకోలేదని పేర్కొన్నారు. ఆ క్రమంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో ముఖేష్ అంబానీ జీతం సున్నా అని ప్రకటించారు. అయితే ముఖేష్ జీతం తీసుకోకుండా, షేర్లు అమ్మకుండా ఉంటే తమ ఖర్చులను ఎలా నిర్వహిస్తారని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అవి ఎలా నిర్వహిస్తారనే విషయాలను ఇప్పుడు చుద్దాం.


జీతం లేకున్నా కూడా..

ముఖేష్ అంబానీ జీతం(salary) తీసుకోనప్పటికీ ఆయన ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించుకుంటారు. ఎందుకంటే స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్, పెట్టుబడుల ద్వారా వచ్చే సంపదతో ఆయన ఖర్చులతోపాటు వేల కోట్లు సంపాదిస్తారు. ఎలాగంటే ముఖేష్ అంబానీకి డివిడెండ్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ఇది కాకుండా ఆయన IPL జట్టు ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వచ్చే యాడ్స్ నుంచి రెవెన్యూ సంపాదిస్తారు. ఇది కాకుండా ఆయన తన వ్యక్తిగత పెట్టుబడుల నుంచి కూడా సంపాదిస్తారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ముఖేష్ అంబానీ కుటుంబానికి 50.39 శాతం వాటా ఉంది.

ఇవి కూడా చదవండి:

Multibagger Stock: మల్టీబ్యాగర్‌ లిస్ట్‌లోకి హైదరాబాద్ స్టాక్.. మూడేళ్లలో 460% రిటర్స్న్


ఇలా కూడా..

ఇందులో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) తల్లి కోకిలాబెన్ అంబానీకి గరిష్టంగా 0.24% అంటే 160 లక్షల షేర్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీకి 0.12% అంటే 80 లక్షల షేర్లు ఉన్నాయి. నీతా అంబానీ, ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ, అనంత్ అంబానీలకు 0.12% అంటే 80 లక్షల షేర్లు ఉన్నాయి. అంటే మొత్తం 3 బిలియన్ 32 కోట్ల 27 లక్షల 48 వేల 48 షేర్లు. ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం వారి వాటాపై డివిడెండ్ డబ్బును పొందుతారు. ఉదాహరణగా తీసుకుంటే FY24 నాలుగో త్రైమాసిక ఫలితాల ప్రకటనలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక్కో షేరుకు రూ.10 డివిడెండ్ ప్రకటించింది. దీని ప్రకారం ముఖేష్ అంబానీ వ్యక్తిగతంగా రూ.8 కోట్లు (80 లక్షల షేర్) దక్కించుకున్నారని చెప్పవచ్చు.


డివిడెండ్ అంటే ఏమిటి

కొన్ని కంపెనీలు వారి లాభంలో(profit) కొంత భాగాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తాయి. దీనిని డివిడెండ్(dividend) అంటారు. ఉదాహరణకు రిలయన్స్ రూ. 1000 లాభాన్ని పొందితే కంపెనీ తన కంపెనీ పురోగతి కోసం రూ. 500 దాని వాటాదారులకు రూ. 500 పంపిణీ చేస్తుంది. ఆ క్రమంలో ముఖేష్ అంబానీ సాధారణ పెట్టుబడిదారుల మాదిరిగా రిలయన్స్ షేర్లు ద్వారా సంపాదిస్తారు. ముఖేష్ అంబానీకి సాధారణ వాటాదారుల కంటే ఎక్కువ షేర్లు ఉన్నందున ఆయనకు డివిడెండ్ కూడా ఎక్కువగా లభిస్తుంది. ఆ విధంగా ఆయన పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. 2019 వరకు ముఖేష్ అంబానీ 15 కోట్ల రూపాయలను జీతంగా తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి:

Alert: దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నులో ఉపశమనం.. ఎప్పటివరకంటే


Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం.. ఏటా 50 లక్షలకుపైగా సంపాదించే ఛాన్స్!


Saving Tips: SBI Fd Vs KVP.. రూ. 5 లక్షలు 10 ఏళ్ల పెట్టుబడికి ఏది బెస్ట్

Saving Scheme: రోజూ ఇలా రూ.200 సేవ్ చేయండి.. రూ.28 లక్షలు పొందండి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 07 , 2024 | 05:54 PM