మ్యూచువల్ ఫండ్ల రిస్క్‌కు కలర్ కోడింగ్!
ABN , Publish Date - Sep 28 , 2024 | 05:26 AM
మ్యూచువల్ ఫండ్లు తమ పథకాల్లో పెట్టుబడులపై రిస్క్‌ను తెలియపరిచే విధానాన్ని మరింత మెరుగుపరచాలని సెబీ యోచిస్తున్నది. ఇందుకోసం కలర్ కోడింగ్ రిస్క్ మీటర్‌ను ప్రవేశపెట్టాలని శుక్రవారం విడుదల చేసిన చర్చాపత్రంలో ప్రతిపాదించింది. ఫండ్లు అతి తక్కువ రిస్క్‌ను ఆకుపచ్చ
సెబీ కొత్త ప్రతిపాదన
మ్యూచువల్ ఫండ్లు తమ పథకాల్లో పెట్టుబడులపై రిస్క్‌ను తెలియపరిచే విధానాన్ని మరింత మెరుగుపరచాలని సెబీ యోచిస్తున్నది. ఇందుకోసం కలర్ కోడింగ్ రిస్క్ మీటర్‌ను ప్రవేశపెట్టాలని శుక్రవారం విడుదల చేసిన చర్చాపత్రంలో ప్రతిపాదించింది. ఫండ్లు అతి తక్కువ రిస్క్‌ను ఆకుపచ్చ రంగు, అత్యధిక రిస్క్‌ను ఎరుపు రంగు ద్వారా తెలియజేయాలని సూచించింది. ఈ కలర్ కోడ్‌లో మొత్తం ఆరు రిస్క్ స్థాయిలుంటాయి. వాటిని ఆరు వేర్వేరు రంగులతో తెలియజేయాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లకు తమ ఫండ్ పెట్టుబడుల రిస్క్‌పై మరింత సులువుగా అవగాహన కల్పించేందుకు ఇది దోహదపడనుందని సెబీ భావిస్తోంది. అంతేకాదు, మ్యూచువల్ ఫండ్లు పథకం రిస్క్ స్థాయిని తమ యూనిట్ హోల్డర్లకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి ఉంటుంది. రిస్క్ స్థాయి మారినప్పుడల్లా నోటీస్, ఈ-మెయిల్ లేదా ఎస్‌ఎంఎస్ ద్వారా తెలియజేయాలని సెబీ ప్రతిపాదించింది. అలాగే, ఫండ్లు ప్రస్తుత రిస్క్ మీటర్‌తో పాటు సవరించిన రిస్క్ మీటర్‌ను సైతం ప్రదర్శించాలని సెబీ స్పష్టం చేసింది. ప్రస్తుత రిస్క్ మీటర్ కేవలం రిస్క్ స్థాయిల వివరాలతో నలుపు, తెలుపు రంగులో ఉంటుంది. అయితే, ఇప్పటికే పలు ఫండ్లు తమ పథకాల రిస్క్‌ను కలర్ కోడింగ్ ద్వారానూ తెలియజేస్తున్నాయి.