Upcoming IPOs: వచ్చే వారం రానున్న ఐపీఓలు..ఈసారి ఎన్ని ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 09:35 AM
దేశీయ స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. ఈ క్రమంలో మార్చి 17 నుంచి మొదలు కానున్న వారంలో ఎన్ని ఐపీఓలు రాబోతున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ స్టాక్ మార్కెట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ప్రతి వారం కూడా కొత్త కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను (Upcoming IPOs) విడుదల చేస్తూ, తమ వ్యాపారాలను విస్తరించేందుకు ప్రయత్నింటాయి. ఈ క్రమంలో వచ్చే వారం (మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే వారం) IPO మార్కెట్‌లో కొన్ని కొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
కొత్తగా ప్రారంభమయ్యే IPOలు
వచ్చే వారం మొత్తం 3 కొత్త IPOలు ప్రారంభం కానున్నాయి. వీటిలో రెండు SME విభాగానికి, ఒకటి మెయిన్‌బోర్డ్ విభాగానికి చెందినది.
పరదీప్ పరివాహన్ IPO
మొత్తం ఇష్యూ పరిమాణం: రూ. 44.86 కోట్లు
ప్రారంభ తేదీ: మార్చి 17, 2025
ముగింపు తేదీ: మార్చి 19, 2025
ధర పరిధి: ఒక్కో షేరుకు రూ. 93-98
లాట్ సైజు: 1200 షేర్లు
కేటాయింపు తేదీ: మార్చి 20, 2025
లిస్టింగ్ తేదీ: మార్చి 24, 2025 (BSE SME)
డివైన్ హీరా జ్యువెలర్స్ IPO
మొత్తం ఇష్యూ పరిమాణం: రూ. 31.84 కోట్లు
ప్రారంభ తేదీ: మార్చి 17, 2025
ముగింపు తేదీ: మార్చి 19, 2025
ధర: ఒక్కో షేరుకు రూ. 90
లాట్ సైజు: 1600 షేర్లు
కేటాయింపు తేదీ: మార్చి 20, 2025
లిస్టింగ్ తేదీ: మార్చి 24, 2025 (NSE SME)
అరిసిన్‌ఫ్రా సొల్యూషన్స్ IPO (మెయిన్‌బోర్డ్)
మొత్తం కొత్త షేర్లు: 2.86 కోట్ల షేర్లు
ప్రారంభ తేదీ: మార్చి 20, 2025
ముగింపు తేదీ: మార్చి 25, 2025
కేటాయింపు తేదీ: మార్చి 26, 2025
లిస్టింగ్ తేదీ: మార్చి 28, 2025 (BSE, NSE)
దీని ధరను ఇంకా ప్రకటించలేదు
స్టాక్ మార్కెట్లో కొత్తగా లిస్ట్ కానున్న కంపెనీలు
ఈ వారం స్టాక్ మార్కెట్లో రెండు SME కంపెనీలు లిస్టింగ్ కానున్నాయి.
PDP షిప్పింగ్ – మార్చి 18, 2025 (BSE SME)
సూపర్ ఐరన్ ఫౌండ్రీ – మార్చి 19, 2025 (BSE SME)
SEBI ఆమోదం పొందిన భారీ IPOలు
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా IPO: భారతీయ మార్కెట్‌లో LG ఎలక్ట్రానిక్స్ తన IPO కోసం SEBI ఆమోదం పొందింది. ఇది రూ. 15,000 కోట్ల పరిమాణంతో ఉండే అవకాశం ఉంది. అయితే ఖచ్చితమైన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
IPO మార్కెట్‌పై ఫోకస్..
ఈ వారం IPO మార్కెట్‌లో కొంత మందగమనమే కనిపిస్తున్నప్పటికీ, SME విభాగంలో కొత్త కంపెనీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాయి. మెయిన్ బోర్డ్ విభాగంలో కొత్త పబ్లిక్ ఇష్యూల సంఖ్య తక్కువగానే ఉన్నా, అరిసిన్‌ఫ్రా సొల్యూషన్స్ IPO పెట్టుబడిదారుల ఆసక్తిని రాబట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
Delhi Air Quality: రాజధాని ప్రజలకు గుడ్ న్యూస్.. మూడేళ్లలో కొత్త రికార్డు!
Gold Silver Rates Today: తగ్గిన గోల్డ్, భారీగా పెరిగిన వెండి.. ఎంతకు చేరుకున్నాయంటే..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News