Share News

పన్ను పోటు తగ్గించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

ABN , Publish Date - Mar 16 , 2025 | 05:03 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ముగింపు దగ్గర పడుతోంది. దీంతో ట్యాక్స్‌ ప్లానింగ్‌ కూడా చివరి దశకు చేరిందని చెప్పాలి. పాత పన్ను చెల్లింపు విధానంలో ఉండి.. ఇంకా ఎవరైనా తమ ట్యాక్స్‌ ప్లానింగ్‌ పూర్తి చేయకపోతే...

పన్ను పోటు తగ్గించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

తొందర పడితే బెటర్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ముగింపు దగ్గర పడుతోంది. దీంతో ట్యాక్స్‌ ప్లానింగ్‌ కూడా చివరి దశకు చేరిందని చెప్పాలి. పాత పన్ను చెల్లింపు విధానంలో ఉండి.. ఇంకా ఎవరైనా తమ ట్యాక్స్‌ ప్లానింగ్‌ పూర్తి చేయకపోతే వెంటనే బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే పన్ను ఆదా చేసే బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (టీఎ్‌సబీఎ్‌ఫడీ)పై దృష్టి పెట్టడం మంచిది. ఈ ఎఫ్‌డీలు పన్ను పోటు తగ్గించడంతో పాటు ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయాన్ని ఇస్తాయి.

దేశంలో వడ్డీ రేట్ల పెరుగుదలకు దాదాపుగా తెరపడింది. ఫిబ్రవరి నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడు నెలల కనిష్ఠ స్థాయి 3.6 శాతానికి దిగొచ్చింది. దీంతో ఏప్రిల్‌లో జరిగే ద్రవ్య పరపతి విధాన సమీక్ష (ఎంపీసీ) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కీలక రెపో రేటును మరో పావు శాతం (0.25ు) తగ్గిస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బ్యాంక్‌ ఎఫ్‌డీలపైనా వడ్డీ రేట్లు తగ్గుతాయి. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఏ మాత్రం నష్టభయాన్ని (రిస్క్‌) భరించలేని మదుపరులకు సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసే బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల (టీఎ్‌సబీఎ్‌ఫడీ)పై దృష్టి పెట్టడం మంచిది.


అర్హత: ఇది కూడా ఒకరకమైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్టే. కాకపోతే సెక్షన్‌ 80సీ కింద ఏటా ఈ ఎఫ్‌డీ పెట్టుబడులకు రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. అవిభక్త హిందూ కుటుంబాలు (హెచ్‌యూఎ్‌ఫ), దేశంలోనే నివసించే భారతీయులు ఈ ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీల్లో మదుపు చేయవచ్చు. భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు, ట్రస్టులకు మాత్రం ఈ ఎఫ్‌డీల్లో మదుపు చేసే అర్హత లేదు. వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా కూడా పన్ను చెల్లింపుదారులు ఈ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చు. మైనర్లు కూడా పెద్దలతో కలిసి ఈ ఎఫ్‌డీల్లో మదుపు చేయవచ్చు. అయితే ఉమ్మడిగా మదుపు చేస్తే ఫస్ట్‌ హోల్డర్‌కు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది.

వడ్డీ చెల్లింపు: నెలనెలా లేదా మూడు నెలలకు ఒకసారి ఈ ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీలపై వడ్డీ చెల్లిస్తారు. ఏ ఆప్షన్‌ కావాలన్నది డిపాజిటర్లే ఎంచుకోవాలి. ఎంచుకున్న ఆప్షన్‌ ప్రకారం ఆ టైమ్‌కు వడ్డీ ఆదాయం నేరుగా వారి ఖాతాల్లో జమవుతుంది. ఒకవేళ వద్దనుకుంటే ఈ మొత్తాన్ని అసలులో తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు.


పరిమితులు: ఈ ఎఫ్‌డీల్లో కనీస పెట్టుబడి రూ.100. ఆ తర్వాత రూ.100 చొప్పున ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు మించకుండా మదుపు చేయవచ్చు.

బదిలీ: ఈ ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీని ఒక ఊరి నుంచి మరో ఊరికి లేదా ఒక బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌ బ్రాంచీ నుంచి మరో బ్రాంచీకి బదిలీ చేసుకోవచ్చు. కాబట్టి తరచూ బదిలీలు ఉండే ఉద్యోగులకు ఇది అత్యంత అనుకూలం.

వడ్డీ రేటు: ఈ డిపాజిట్లపై ఒక్కో బ్యాంక్‌ ఒక్కో వడ్డీ రేటు చెల్లిస్తుంది. ప్రస్తుతం బ్యాంకులు ఈ డిపాజిట్లపై 6.5 శాతం నుంచి 7 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్నాయి. నాన్‌-సీనియర్‌ సిటిజన్లతో పోలిస్తే ఆరు పదుల వయసు పైబడి సీనియర్‌ సిటిజన్లకు ఈ ఎఫ్‌డీలపై అర శాతం (0.5ు) వరకు అధిక వడ్డీ చెల్లిస్తారు.

జాగ్రత్తలు: అన్ని గుడ్లూ ఒకే బుట్టలో పెట్టకూడదనేది సామెత. ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీలకూ ఇది వర్తిస్తుంది. అధిక వడ్డీకి ఆశపడి ఉన్న నాలుగు రాళ్లూ ఒకే బ్యాంకులో కాకుండా రెండు మూడు బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయడం మంచిది. దీనివల్ల ఎంత డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పథకం కవరేజీ ఉన్నా, ఒక బ్యాంక్‌ దివాలా తీసినా మరో బ్యాంక్‌ ఎఫ్‌డీ అదుకుంటుంది.


లాక్‌ ఇన్‌ పీరియడ్‌

ఈ ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీల లాక్‌ ఇన్‌ పీరియన్‌ ఐదేళ్లు. అంటే ఈ ఐదేళ్ల పాటు ఈ ఎఫ్‌డీలను వెనక్కి తీసుకునే అవకాశం ఉండదు. అలాగే ఈ ఎఫ్‌డీల హామీపై ఎలాంటి రుణాలు గానీ, ఓవర్‌ డ్రాఫ్ట్‌ గానీ తీసుకునే అవకాశమూ లేదు. వీటికి ఆటో-రెన్యూవల్‌ ఆఫ్షన్‌ కూడా ఉండదు. కాబట్టి గడువు ముగిసిన వెంటనే ఈ ఎఫ్‌డీలను వెనక్కి తీసుకోవాలి. అయితే గడువు ముగిసిన వెంటనే మరో ఐదేళ్లకు ఎఫ్‌డీని రెన్యూవల్‌ చేసుకోవచ్చు.

ఎవరికి అనుకూలం ?

ఆయా వ్యక్తుల వయసు, ఆర్థిక లక్ష్యాలు, నష్టాలు భరించే శక్తి (రిస్క్‌), వేచి ఉండగల కాలం, ప్రస్తుత-భవిష్యత్‌ ఆదాయ అంచనాల ఆధారంగా మదుపరులు ఈ ట్యాక్స్‌ సేవింగ్‌ ఎఫ్‌డీలను ఎంచుకోవాలి. అసలుకు ఏ మాత్రం ఢోకా లేకుండా పన్ను ఆదా కోరుకునే మదుపరులకు ఈ ఎఫ్‌డీలు అత్యంత అనుకూలం. సీనియర్‌ సిటిజన్లు, రిటైర్మెంట్‌కు దగ్గర పడుతున్న వారికి ఇవి అనుకూలమని చెప్పాలి. ఇక పాత పన్ను చెల్లింపు విధానంలో ఉండి, పెట్టుబడుల అసలుకు ఢోకా లేకుండా పన్ను ఆదా కోరుకునే ఉద్యోగులు, వృత్తి నిపుణులూ ఈ ఎఫ్‌డీలపై ఒక కన్నేయడం మంచిది.


పన్ను ప్రభావం

ఈ ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్స్‌’గా పరిగణించి ఆయా వ్యక్తుల ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను విధిస్తారు. సీనియర్‌ సిటిజన్లకు వచ్చే వార్షిక వడ్డీ ఆదాయం రూ.లక్ష మించినా, ఇతరులకు వచ్చే వడ్డీ ఆదాయం రూ.50,000 మించితే 10 శాతం చొప్పున టీడీఎస్‌ కట్‌ అవుతుంది. పాన్‌ నంబరు సమర్పించకపోతే మాత్రం 20 శాతం చొప్పున టీడీఎస్‌ కట్‌ అవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే నాన్‌-సీనియర్‌ సిటిజన్లు ఫామ్‌ 15జీ, సీనియర్‌ సిటిజన్లు ఫామ్‌ 15హెచ్‌ సమర్పించడం ద్వారా ఈ టీడీఎస్‌ పోటు నుంచి తప్పించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

Samsung: శాంసంగ్ నుంచి మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్..ఏకంగా ఆరేళ్లపాటు..

Gold Silver Rates Today: భయపెడుతున్న బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 16 , 2025 | 05:03 AM