ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Stock Markets: పెట్టుబడిదారులకు షాక్.. సెన్సెక్స్, నిఫ్టీ ఎంత నష్టపోయాయంటే..

ABN, Publish Date - Nov 08 , 2024 | 11:14 AM

దేశీయ స్టాక్ మార్కెట్లు వారాతంలో స్వల్ప లాభాలతో మొదలై, నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో బెంచ్‌మార్క్ ప్రధాన సూచీలు మొత్తం రెడ్‌లోనే ఉన్నాయి. అయితే ఆయా సూచీలు ఏ మేరకు తగ్గాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

stock markets losses

దేశీయ స్టాక్ మార్కెట్లు (stock market) ఈరోజు సెన్సెక్స్, నిఫ్టీ సహా దాదాపు సూచీలు మొత్తం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తదుపరి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నిన్న పుంజుకున్న స్టాక్ మార్కెట్లు, ఈరోజు మాత్రం తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 77 పాయింట్లు క్షీణించి 79,464.82 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు తగ్గిపోయి 24,159.05 పరిధిలో ట్రైడయ్యాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 304 పాయింట్లు తగ్గుముఖం పట్టగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 373 పాయింట్లు పడిపోయింది. దీంతో మదుపర్లు కొన్ని గంటల్లోనే వేల కోట్ల రూపాయలను నష్టపోయారు.


టాప్ 5 స్టాక్స్

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ట్రెంట్, BPCL, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, రిలయన్స్ కంపెనీల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫోసిస్, హిందాల్కో, HCL టెక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. ఈరోజు పేజ్ ఇండస్ట్రీస్ షేర్లు 2.5% పెరుగుదలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 50లో 50 స్టాక్‌లలో తొమ్మిది మాత్రమే గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. లాభాల్లో ఇన్ఫోసిస్ (1.27 శాతం వృద్ధి) ముందుంది. సెక్టార్లలో ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 1 శాతం పెరిగి, మెటల్, ఫార్మా, హెల్త్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అన్ని ఇతర రంగాల సూచీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి. OMC ఇండెక్స్ 1.07 శాతం పడిపోయింది.


లాభాల ప్రకటన

మరోవైపు తాజాగా లుపిన్ Q2FY25 నికర లాభాన్ని ప్రకటించింది. ఇది గత సంవత్సర కాలంలో రూ.490 కోట్ల నుంచి రూ.850 కోట్లకు పెరిగింది. Q2FY25 FY23లో రూ.5,040 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో ఆదాయం రూ. 5,670 కోట్లకు చేరుకుంది. కంపెనీ Ebitda రూ. 1,340 కోట్లకు పెరిగింది. ఇంకోవైపు కొచ్చిన్ షిప్‌యార్డ్ కూడా Q2FY25 నికర లాభాన్ని రూ. 193 కోట్లుగా నివేదించింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ. 200 కోట్లు. ఈ త్రైమాసికంలో ఆదాయం క్యూ2ఎఫ్‌వై25లో రూ.954 కోట్ల నుంచి రూ.1,097 కోట్లకు పెరిగింది. కంపెనీ Ebitda రూ. 196 కోట్లుగా ఉంది.


తగ్గిన రేట్లు

ఇది మునుపటి సంవత్సరంలో రూ. 195 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగింది. Ebitda మార్జిన్ Q2FY25 FY23లో 20.43 శాతంతో పోలిస్తే 17.87 శాతానికి తగ్గింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. అమెరికా ఫెడ్ గురువారం 25 బేసిస్ పాయింట్ల మేర రేట్లను తగ్గించింది. ధర ఒత్తిళ్లు మునుపటి వాటితో పోలిస్తే పురోగతి సాధించాయని పేర్కొంది. ఈ అంశం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించింది. మరోవైపు దేశంలోని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల అంశం కూడా స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: నవంబర్ 2024లో బ్యాంక్ సెలవులు.. దాదాపు సగం రోజులు బంద్..


Investment Tips: ఒకేసారి రూ. 12 లక్షలు పెట్టుబడి చేసి మరచిపోండి.. ఆ తర్వాత ఎంతవుతుందంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 08 , 2024 | 11:18 AM