ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tata Nexon: టాటా నెక్సాన్ కారుపై భారీ తగ్గింపు..? ఎంతంటే..?

ABN, Publish Date - Jun 23 , 2024 | 11:17 AM

టాటా కార్లలో నెక్సాన్‌ సబ్ కాంటాక్ట్ ఎస్‌యూవీ మంచి సేల్స్ అవుతున్నాయి. కారు లుక్ పరంగా, మైలేజి పరంగా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. నెక్సాన్ కారును కంపెనీ 2017లో లాంచ్ చేసింది. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ వెర్షన్లు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. ఏడేళ్లలో ఏడు లక్షల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించింది. నెక్సాన్ కార్లకు జనం నుంచి వస్తోన్న ఆదరణకు అనుగుణంగా డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లను రూ.16 వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గించింది.

Tata Nexon

హైదరాబాద్: టాటా కార్లలో నెక్సాన్‌ సబ్ కాంటాక్ట్ ఎస్‌యూవీ మంచి సేల్స్ అవుతున్నాయి. కారు లుక్ పరంగా, మైలేజి పరంగా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంది. నెక్సాన్ కారును కంపెనీ 2017లో లాంచ్ చేసింది. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ వెర్షన్లు ఉన్నాయి. తర్వాత ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి వచ్చింది. ఏడేళ్లలో ఏడు లక్షల నెక్సాన్ కార్లను కంపెనీ విక్రయించింది. నెక్సాన్ కార్లకు జనం నుంచి వస్తోన్న ఆదరణకు అనుగుణంగా డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్ కార్లను రూ.16 వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గించింది. ఈ నెల 30వ తేదీ వరకు ఆ ఆఫర్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. నెక్సాన్ బేసిక్ కారుకు మాత్రం డిస్కౌట్ ఉండదని తేల్చి చెప్పింది.


  • పెట్రోల్ స్మార్ట్, స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్ కార్లపై వరసగా రూ.16 వేలు, రూ.20 వేలు, రూ.40 వేల తగ్గింపు ఉంటుంది.

  • ప్యూర్, ప్యూర్ ఎస్ పెట్రోల్ వేరియంట్ కార్లపై రూ.30 వేలు, రూ.40 వేలు తగ్గింపు. డీజిల్ కార్లపై రూ.20 వేలు, రూ.30 వేల డిస్కౌంట్ ఉంటుంది.

  • క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, క్రియేటివ్ ప్లస్ ఎస్ పెట్రోల్, డీజిల్ కార్లపై రూ.60 వేలు, రూ.80 వేలు, రూ.లక్ష వరకు తగ్గింపు ఉంటుంది.

  • ఫియర్ లెస్, ఫియర్ లెస్ ఎస్, ఫియర్ లెస్ ప్లస్, ఫియర్ లెస్ ప్లస్ ఎస్ పెట్రోల్, డీజిల్ కార్లపై రూ.60 వేల తగ్గింపు ఉంటుంది.

  • వీటితోపాటు 2023కు చెందిన సఫారీ, హరియర్, ఫేస్ లిప్ట్ మోడల్ కార్లపై రూ. లక్ష 35 వేల వరకు తగ్గింపు ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

Updated Date - Jun 23 , 2024 | 11:18 AM

Advertising
Advertising