Today Gold Rates: బంగారం కొనేందుకు బెస్ట్ టైమ్.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు
ABN, Publish Date - Dec 21 , 2024 | 09:33 AM
Today Gold Rates: నిన్న మొన్నటి దాకా కొండెక్కిన బంగారం ఇప్పుడు దిగొచ్చింది. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్ కస్టమర్స్‌ను ఊరిస్తున్నాయి. మరి.. ఈ రోజు తులం పసిడి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం..
బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర మాత్రం గోల్డ్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. పసిడితో భారతీయులకు విడదీయరాని సంబంధం ఉంది. పెళ్లిళ్ల దగ్గర నుంచి వేడుకలు, శుభకార్యాల వరకు ఏదైనా పసిడి బంగారు ఆభరణాలు లేకుండా అవ్వదు. ముఖ్యంగా మహిళలు వీటిని బాగా ఇష్టపడుతుంటారు. గోల్డ్ అనేది మన దగ్గర స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అదే సమయంలో దీన్ని ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడటం పెరిగింది. అందుకే బంగారానికి డిమాండ్ ఎక్కువవుతోంది. అయితే ధర విషయంలో గోల్డ్ ఊహించని రీతిలో పెరుగుతూ షాక్ ఇస్తోంది. కానీ ఎట్టకేలకు పసిడి దిగొచ్చింది.
రీజన్ అదే..
బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఆ మధ్య వరుసగా పెరుగుతూ పోయిన గోల్డ్.. ఈజీగా రూ.80 వేల మార్క్‌ను అందుకుంటుందని అంతా భావించారు. అయితే పలు అంతర్జాతీయ పరిణామాల వల్ల పసిడి దిగొచ్చింది. భారీగా ధరలు పతనమయ్యాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. ఫ్యూచర్‌లో ఇంతలా తగ్గింపులు ఉండకపోవచ్చనే సిగ్నల్స్ ఇచ్చింది. దీంతో గోల్డ్ రేట్స్ వరుసగా పడుతున్నాయి. మూడ్రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి.. ఇప్పుడు రూ.75 వేల మార్క్‌ను చేరుకునేలా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఇవాళ 24 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.76,800గా నమోదైంది.
వెండీ అదే దారిలో..
డిసెంబర్ 21వ తేదీన భాగ్యనగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.70,400కు చేరింది. నిన్నటితో పోలిస్తే బంగారం తాజాగా రూ.300 పతనమైంది. అటు వెండి కూడా భారీగా పతనమైంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.98 వేల దగ్గర ఉంది. అదే దేశ రాజధాని న్యూఢిల్లీలో కేజీ సిల్వర్ రూ.1,000 మేర తగ్గి రూ.90,500కు చేరింది. ఈ ధరలన్నీ శనివారం ఉదయం 6 గంటల లోపు నమోదైనవి. కాగా, గోల్డ్, సిల్వర్ రేట్స్ ఒక్కోసారి మధ్యాహ్నానికే మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనాలనుకుంటే స్థానికంగా ధరలు తెలుసుకొని ముందుకెళ్లడం మంచిది.
Also Read:
బజాజ్ చేతక్ ఈ-స్కూటర్ కొత్త వెర్షన్
హోండా కార్ల ధర పెంపు
ఫెడ్ షాక్‌కు మార్కెట్లు కుదేలు
For More Business And Telugu News
Updated Date - Dec 21 , 2024 | 09:38 AM