ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Vegetable Prices: సామాన్యుడికి షాక్ ఇస్తున్న కూరగాయలు.. నెలాఖరు వరకు దంచుడే..

ABN, Publish Date - Dec 09 , 2024 | 08:54 AM

Vegetable Prices: సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి కాయగూరలు. ధరలతో ప్రజల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. కొనాలంటే భయపడేలా చేస్తున్నాయి. రోజురోజుకీ రేట్లు మరింత పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి.

హైదరాబాద్: కూరగాయలు, నిత్యావసర వస్తువులు సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరల కారణంగా కొని తినలేని పరిస్థితి నెలకొంది. వాటి కోసం దుకాణానికి వెళ్లాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్. సామాన్య, మధ్యతరగతి ప్రజల్ని వెజిటేబుల్ రేట్స్ బెంబేలెత్తిస్తున్నాయి. బియ్యం నుంచి మినపపప్పు వరకు, ఉల్లి నుంచి ఆలూ వరకు అన్నీ కొండెక్కి కూర్చున్నాయి. దీంతో వంట వండుకోవడం కంటే పస్తులు ఉండటం బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు ఇప్పట్లో తగ్గేలా లేవు. నెలాఖరు వరకు దంచుడే అనేలా ఉంది పరిస్థితి.


జేబులు గుల్ల

గత వారం రోజులుగా కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగాయి. దాదాపు 15 నుంచి 20 శాతం పెరిగి సామాన్యుడి జేబులు గుల్ల చేస్తున్నాయి. బియ్యం ధరలు కనీసం కిలో రూ.50, పాత బియ్యం అయితే రూ.59 నుంచి రూ.70 దాకా ఉంటున్నాయి. ఈ పది రోజుల్లో బియ్యం రేట్లు రూ.5 నుంచి రూ.9 వరకు పెరిగాయి. కందిపప్పు ధర అయితే డబుల్ సెంచరీ దాటేసింది. కిలో కందిపప్పు ధర రూ.200 నుంచి రూ.230 వరకు ఉంది. అదే వంటల్లో అధికంగా వాడే మినపపప్పు అయితే రూ.130-రూ.148గా ఉంది.


ముట్టుకుంటే షాకే

పెసరపప్పు ధరలు కూడా భగ్గుమంటున్నాయి. కిలో పెసరపప్పు రూ.160గా ఉంది. శనగపప్పు కూడా కొండెక్కింది. మామూలు కంటే రూ.30 అధికంగా ఉంది. రవ్వ, పల్లీల రేట్స్ కూడా రూ.10 నుంచి రూ.20 దాకా పెరిగాయి. కిచెన్‌లో ఎంతో కీలకమైన వంట నూనెల ధరలు నెల రోజుల్లో రూ.20 వరకు పెరిగాయి. గత వారం రోజులుగా ఉల్లి, టమాట ధరలు మంట పుట్టిస్తున్నాయి. కిలో ఉల్లిగడ్డ రూ.60గా ఉంది. అదే టమాట కిలో రూ.50 నుంచి రూ.60 దాకా ఉంది. క్యారెట్, బీట్రూట్ ధర రూ.60, బంగాళదుంపలు రూ.50.. దొండకాయ, బెండకాయ, గోరు చిక్కుడుకాయ, వంకాయ రూ.40కి పైగా ఉన్నాయి.


Also Read:

హిందుత్వ ఒక వ్యాధి.. ఇల్తిజా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలు

పాక్‌కు బంగ్లా మరింత చేరువ!

తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ రాజకున్న రాజకీయం

For More Business And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 09:04 AM