Cyber Fraud: వీడు మహా కేటుగాడు.. వీడియో కాల్ చేసి, బాత్రూంకి కూడా వెళ్లనివ్వకుండా..
ABN, Publish Date - May 18 , 2024 | 08:03 AM
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించి.. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాగోలా అమాయకుల్ని మభ్యపెట్టి, వారి వద్ద నుంచి లక్షల రూపాయలు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించి.. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాగోలా అమాయకుల్ని మభ్యపెట్టి, వారి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. ఓ కేటుగాడు కూడా అదే పని చేయబోయాడు. ఒక మహిళకు వీడియో కాల్ చేసి, రాత్రి నుంచి ఉదయం వరకూ మాట్లాడి, రూ.60 లక్షలో దోచేసేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి, ఆ సొమ్ము ఆ దుండగుడికి ఖాతాలోకి వెళ్లనివ్వకుండా ఆపేశారు.
ఏ సాక్ష్యాలతో కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు: సుప్రీం
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఈ నెల 15వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌కాల్ లిఫ్ట్ చేయగానే.. అవతలి వ్యక్తి తనని తాను మహారాష్ట్ర పోలీస్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్నాడు. తనతో ఏం పని అని ఆ మహిళ ప్రశ్నించగా.. ‘మీరు మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అరెస్టు వారెంట్ జారీ అయిందని’ అతను పేర్కొన్నాడు. దీంతో భయాందోళనలకు గురైన ఆమె.. తనని ఈ కేసు నుంచి బయటపడేయమని వేడుకుంది. ఇంకేముంది.. తాను వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందని భావించి, ఆమె నుంచి డబ్బులు కాజేయాలని ఆ కేటుగాడు నిర్ణయించుకున్నాడు. తొలుత ఆమెకు వీడియో కాల్ చేసి పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడ్డాడు. బాత్రూంకి కూడా వెళ్లనివ్వకుండా.. వీడియో కాల్‌లోనే ఉంచాడు. ఈ కేసు నుంచి కాపాడాలంటే, తన ఖాతాలో రూ.60 లక్షలు వేయాలని చెప్పాడు.
Hyderabad: రాత్రివేళ.. రోడ్డుపైనే..
ఆ దుండగుడు చెప్పినట్టుగానే.. మరుసటి రోజు ఉదయం బ్యాంకులు తెరిచాక అతని ఖాతాలో రూ.60 లక్షలు జమ చేసింది. ఈ తతంగం అయ్యేదాకా అతడు వీడియోకాల్ కొనసాగించాడు. తీరా తన ఖాతాలో డబ్బులు పడ్డాక మాయమయ్యాడు. కాసేపయ్యాక తాను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో అప్రమత్తమైన సీఎస్‌బీ బృందం.. ఆ డబ్బులు దుండగుడి ఖాతాలోకి బదిలీ అవ్వకుండా నిలిపివేశారు. గంటలోనే ఈ ప్రక్రియ ముగిసేలా.. చకచకా పనులు చేసేశారు. తన డబ్బులు తిరిగిరావడంతో.. బాధితురాలు ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ కేటుగాడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.
Read Latest Crime News and Telugu News
Updated Date - May 18 , 2024 | 08:03 AM