Cyber criminals: మీపైన 15 కేసులు.. చెప్పింది వినకపోతే అరెస్టే..
ABN, Publish Date - Aug 30 , 2024 | 11:41 AM
మనీ ల్యాండరింగ్(Money Laundering) కేసులు, వేధింపుల కేసుల పేరు చెప్పి వృద్ధురాలిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఆమె ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన వృద్ధురాలు(85)కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. తాను టెలికాం శాఖ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది.
- మనీ ల్యాండరింగ్ కేసుల పేరుతో బెదిరించి వృద్ధురాలి ఖాతా ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: మనీ ల్యాండరింగ్(Money Laundering) కేసులు, వేధింపుల కేసుల పేరు చెప్పి వృద్ధురాలిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) ఆమె ఖాతా ఖాళీ చేశారు. నగరానికి చెందిన వృద్ధురాలు(85)కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఓ మహిళ ఫోన్ చేసింది. తాను టెలికాం శాఖ నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పింది. మీ ఫోన్ నంబర్ వినియోగించి వేధింపులు, అసత్య ప్రచారం జరిగాయని, త్వరలోనే మీ నంబర్ బ్లాక్ అవుతుందని హెచ్చరించింది. ఇలా జరగకుండా ఉండాలంటే ఢిల్లీ పోలీసులను సంప్రదించమంటూ, వేరే వ్యక్తిని వీడియోకాల్ ద్వారా లైన్‌లో తీసుకుంది.
ఇదికూడా చదవండి: Special trains: పండుగల నేపథ్యంలో... 60 ప్రత్యేక రైళ్లు పొడిగింపు
ఢిల్లీ దరియాగంజ్ పోలీస్‌స్టేషన్(Delhi Dariyaganj Police Station) అధికారిగా పరిచయం చేసుకున్న అతడు.. మీపై ఢిల్లీ కోర్టులో 15 కేసులు నమోదయ్యాయని చెప్పాడు. అంతేగాకుండా మీ బ్యాంక్ ఖాతాల నుంచి విదేశాలకు కోట్ల కొద్దీ డబ్బు వెళ్లిందని, దీనిపై సీబీఐ అధికారులకు వివరణ ఇవ్వండి అంటూ మరో వ్యక్తికి ఫోన్ కలిపాడు. సీబీఐ(CBI) అధికారిగా పరిచయం చేసుకున్న అతడు మీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, మీ ఖాతాలు తనిఖీ చేయాలని దానికి సంబంధించి కోర్టు ఆర్డర్ ఉందంటూ కాపీ చూపాడు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లతోపాటు ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం తాము సూచించిన ఆర్‌బీఐ ఖాతాకు మళ్లించాలని చెప్పాడు. వీడియో కాల్ ఆపవద్దని, కెమెరా ముందే ఉండాలని చెప్పాడు. ఈ విషయం ఎవరితోనైనా చర్చించినా వెంటనే అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. అలా వృద్ధురాలిని భయపెట్టి గృహనిర్భదం చేసి, ఆమె ఖాతాలో ఉన్న రూ. 8.75 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించినవృద్ధురాలు స్నేహితుడి సాయంతో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
......................................................................
Hyderabad: మహనీయుడు నందమూరి హరికృష్ణ...
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ చైతన్యరథానికి సారధిగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన మహనీయుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ(Nandamuri Harikrishna) అని టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు పి. సాయిబాబా(P. Sai Baba) కొనియాడారు. గురువారం టీడీపీ నగర కార్యాలయంలో నందమూరి హరికృష్ణ వర్ధంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొన్న ఏకైక వ్యక్తి హరికృష్ణ అని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శులు నల్లెల కిషోర్, పి.బాల్‌రాజ్‌గౌడ్, నాయకులు ఎస్. ప్రకాష్, పెద్దోజు రవీంద్రాచారి, జి.యాదగిరిరావు, మేడిపల్లి శ్యామ్‌సుందర్, రాజు, చంద్రమోహన్, వెంకటేష్‌చౌదరి, భానుప్రకాష్, కిరణ్, సత్యనారాయణ, భవానీశ్రీనివాస్, వై.ఎల్.నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 30 , 2024 | 11:41 AM