ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: ఆహా.. ఏం ఐడియా గురూ.. లింకులు పంపి దోచేస్తున్నారుగా..

ABN, Publish Date - Oct 04 , 2024 | 09:14 AM

మీ అడ్రస్‌ అప్‌డేట్‌ చేస్తే తపాలాశాఖ నుంచి వచ్చిన పార్సిల్‌ ఇంటికి చేర్చుతామని నమ్మబలికిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ. 2.43 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళకు 8210587741 నెంబర్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. కొత్త అడ్రస్‌ అప్‌డేట్‌(Update) చేస్తే పార్సిల్‌ను ఇంటికి చేర్చుతామంటూ వాట్స్‌పలో లింక్‌ పంపారు.

- పోస్టల్‌ శాఖను పోలిన వెబ్‌సైట్‌తో బోల్తా కొట్టించి.. అడ్రస్‌ అప్‌డేట్‌ చేయమంటూ రూ. 2.43 లక్షలు కాజేత

- మహిళ ఖాతా నుంచి కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: మీ అడ్రస్‌ అప్‌డేట్‌ చేస్తే తపాలాశాఖ నుంచి వచ్చిన పార్సిల్‌ ఇంటికి చేర్చుతామని నమ్మబలికిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ. 2.43 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళకు 8210587741 నెంబర్‌ నుంచి సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. కొత్త అడ్రస్‌ అప్‌డేట్‌(Update) చేస్తే పార్సిల్‌ను ఇంటికి చేర్చుతామంటూ వాట్స్‌పలో లింక్‌ పంపారు. లింక్‌లో కొత్త అడ్ర్‌సతోపాటు పోస్టల్‌ చార్జీలు రూ.25 చెల్లించాలని సూచించారు. వారు చెప్పిన విధంగానే లింక్‌ను ఓపెన్‌ చేసిన మహిళకు పోస్టల్‌ శాఖను పోలిన వెబ్‌సైట్‌ తెరుచుకుంది.

ఇదికూడా చదవండి: CM Revanth Reddy: భవిష్యత్తులో మొత్తం సన్నాల సాగే!


నిజమేనని నమ్మిన బాధితురాలు అడ్రస్‌ అప్‌డేట్‌ చేయడంతోపాటు క్రెడిట్‌ కార్డు ద్వారా రూ. 25 చెల్లించింది. కొద్దిసేపటికి ఆమె ఖాతా నుంచి రూ.2.43 లక్షలు వేరే ఖాతాకు బదిలీ అయినట్టు సందేశం వచ్చింది. లింక్‌ ద్వారా తెరిచిన వెబ్‌సైట్‌ చెల్లింపుల సందర్భంగా బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలను ఆటోమేటిక్‌గా తీసుకొని డబ్బు బదిలీ చేసింది. దాంతో బాధితురాలు వెంటనే ఖాతాను ఫ్రీజ్‌ చేయించి, సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................

Hyderabad: గూగుల్‌ రేటింగ్‌లకు డబ్బులంటూ మోసం..

- పెట్టుబడి పెడితేనే... ముందు కట్టిన డబ్బు తిరిగి చెల్లిస్తాం అంటూ.. మహిళ నుంచి రూ.1.90 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: గూగుల్‌లో రేటింగ్‌ ఇస్తే డబ్బులు సంపాదించవ్చని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) నగరానికి చెందిన విద్యార్థి నుంచి రూ. 1.90 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన విద్యార్థిని (21)కు వాట్స్‌పలో ఓ సందేశం వచ్చింది. గూగుల్‌లో రేటింగ్‌ ఇస్తే డబ్బులు సంపాదించవచ్చని చెప్పడంతో ఆన్‌లైన్‌ గూగుల్‌ రేటింగ్‌ టాస్క్‌లో చేరింది. టెలిగ్రాం గ్రూపులో యాడ్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు. ముందుగా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టాలని సూచించారు. పెట్టుబడికి తగిన విధంగా కొద్ది మొత్తాల్లో డబ్బు లాభాలు అంటూ ఇచ్చారు. నమ్మం సాధించిన తర్వాత ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలంటే (రెండవ స్టేజ్‌) బిట్‌ కాయిన్‌ ప్రొఫైల్‌లో జాయిన్‌ కావాలని సూచించారు.


బిట్‌ కాయిన్‌ ప్రొఫైల్‌లో చేరాలంటే రూ. 1.90 లక్షలు పెట్టుబడి పెట్టాలన్నారు. పెట్టుబడి పెట్టి పని చేసిన ఆమెకు మరో స్టెప్‌ పైకి రావాంటే (పెట్టుబడికి రెట్టింపు) మరికొంత డబ్బు కట్టాలని సూచించారు. కానీ డబ్బు కట్టేందుకు అంగీకరించని యువతి, ఇప్పటి వరకు పెట్టిన తన పెట్టుబడి తిరిగి ఇవ్వాలని కోరింది. మూడో స్టేజ్‌ పెట్టుబడి పెట్టకుండా డబ్బులు ఇవ్వడం కుదరదన్న సైబర్‌ నేరగాళ్లు మరింత డబ్బు కట్టాలని డిమాండ్‌ చేశారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఇదికూడా చదవండి: నేను మాట్లాడింది తప్పే.. కానీ అతడిని తెలంగాణలో తిరగనీయం

ఇదికూడా చదవండి: మంత్రి సురేఖ‌ వ్యాఖ్య‌లు.. ప్ర‌భాస్, రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళి ఏమ‌న్నారంటే

ఇదికూడా చదవండి: సూర్యాపేట కలెక్టరేట్‌లో లైంగిక వేధింపులు !

ఇదికూడా చదవండి: Etela Rajender : దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 04 , 2024 | 09:14 AM