Cyber criminals:: సైబర్ బాధితులకు రిక‘వర్రీ’
ABN, Publish Date - Nov 30 , 2024 | 07:03 AM
ట్రేడింగ్‌లో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్ల(Cyber criminals) చేతిలో నగరానికి చెందిన ఓ బాధితుడు మోసపోయాడు. పెట్టుబడి పేరుతో పలు దఫాలుగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు.
- ఖాతాలు ఫ్రీజ్ చేసినా బాధితులకు దక్కని ఊరట
- రూ.70 లక్షలు పోగొట్టుకుంటే రూ.లక్ష రికవరీ
- కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న బ్యాంకర్లు
- పోలీస్‌స్టేషన్లు, బ్యాంకుల చుట్టూ బాధితుల ప్రదక్షిణలు
హైదరాబాద్ సిటీ: ట్రేడింగ్‌లో పెద్దమొత్తంలో లాభాలు వస్తాయని సైబర్ నేరగాళ్ల(Cyber criminals) చేతిలో నగరానికి చెందిన ఓ బాధితుడు మోసపోయాడు. పెట్టుబడి పేరుతో పలు దఫాలుగా రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించి సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించగా నేరగాళ్లు వినియోగించిన ఖాతాలను గుర్తించి ఫ్రీజ్ చేయించారు. కానీ ఈ ఖాతాల్లో రూ.లక్ష మాత్రమే ఉండటంతో.. కోర్టులో వ్యాజ్యం వేసిన సైబర్‌క్రైం సిబ్బంది, బాధితుడి ఖాతాలో డబ్బు జమ చేయించేలా ఆదేశాలు ఇప్పించారు.
ఈ వార్తను కూడా చదవండి: ఫార్మా క్లస్టర్ రద్దు!
పరిచయస్తులు, స్నేహితుల వద్ద అప్పులు చేసి, లోన్ తీసుకొని మరీ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టి డబ్బు పోగొట్టుకున్న బాధితుడు కోర్టు ఆర్డర్ కాపీ పట్టుకొని నెలరోజులుగా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. ఇలా వందలాది మంది సైబర్ నేరగాళ్ల బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. కాజేసిన డబ్బు రికవరీ అంతంతే అయినా, రికవరీ చేసిన డబ్బు బాధితుల ఖాతాల్లో జమయ్యేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మరికొన్ని కేసుల్లో కొంతమంది బ్యాంకు అధికారులు కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుల్లో ఎవరు ముందు కోర్టు నుంచి ఆదేశాలు తీసుకువస్తే, బ్యాంకు అధికారులు ఫ్రీజ్ అయిన ఖాతాలో డబ్బు వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. తర్వాత కోర్టు ఆర్డర్ తెచ్చిన వారికి మొండి చేయి చూపిస్తున్నారు.
బ్యాంకు అధికారుల తీరుతో అసహనం
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రికవరీ కోసం కోర్టు ఆర్డర్‌తో వచ్చిన బాధితులకు బ్యాంకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఖాతాలో ఉన్న పేరు, ఆర్డర్ కాపీలో ఉన్న పేరులో కొద్దిపాటి తేడా ఉన్నా బాధితులను తిప్పుకుంటున్నారు. బాధితుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడంతోపాటు ఈ విషయాలు మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ తిప్పి పంపుతున్నారు. దాంతో బాధితులు బ్యాంకు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అలాగే సైబరాబాద్ సైబర్ క్రైం మెయిల్‌ను పోలిన నకిలీ మెయిల్ ఐడీ ద్వారా వచ్చిన సమాచారంతో సైబరాబాద్ పరిధిలోని హెచ్డీఎఫ్సీ బ్యాంకు(HDFC Bank) సిబ్బంది బాధితుడి ఖాతానే ఫ్రీజ్ చేశారు. అధికారిక మెయిల్ ఐడీకి, నకిలీ మెయిల్ ఐడీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా గమనించకుండా, తమకు సమాచారం వచ్చింది, ఫ్రీజ్ చేశామని చెప్పారు. మళ్లీ అదే మెయిల్ నుంచి సమాచారం వస్తేనే ఖాతా అన్‌ఫ్రీజ్ చేస్తామంటూ సమాధానం చెబుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: మూడు జిల్లాల్లో 8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: పోటీపై అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం
ఈవార్తను కూడా చదవండి: రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.141.84 కోట్లు
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 30 , 2024 | 07:03 AM