ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: ఫ్రీ క్రెడిట్‌ కార్డు ఇస్తామంటూ దోపిడీ

ABN, Publish Date - Nov 29 , 2024 | 07:11 AM

లైఫ్‌ టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డు(Lifetime free credit card) ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ ప్రైవేటు ఉద్యోగి ఖాతాలోని రూ.1,00,450 దోచుకున్న సంఘటన ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మన్సూరాబాద్‌ శ్రీనివాసనగర్‌కాలనీలో ఉండే కోటే చంద్రకాంత్‌(34) ప్రైవేటు ఉద్యోగి.

- రూ.1,00,450 దోచుకున్న సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్: లైఫ్‌ టైమ్‌ ఫ్రీ క్రెడిట్‌ కార్డు(Lifetime free credit card) ఇస్తామంటూ సైబర్‌ నేరగాళ్లు ఓ ప్రైవేటు ఉద్యోగి ఖాతాలోని రూ.1,00,450 దోచుకున్న సంఘటన ఎల్బీనగర్‌ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌హెచ్‌ఓ వినోద్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మన్సూరాబాద్‌ శ్రీనివాసనగర్‌కాలనీ(Mansoorabad Srinivasanagar Colony)లో ఉండే కోటే చంద్రకాంత్‌(34) ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 16న గుర్తు తెలియని వ్యక్తి అతడికి ఫోన్‌చేసి తన పేరు చిరంజీవి అని, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: R. Krishnaiah: 26వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలి


ఆ బ్యాంకు నుంచి ఎలాంటి మాన్యువల్‌ రుసుములు లేకుండా ఉచితంగా క్రెడిట్‌ కార్డు ఇస్తున్నామని నమ్మబలికాడు. దీంతో అతడికి చంద్రకాంత్‌ ఆధార్‌ కార్డు నంబర్‌, పాన్‌ కార్డు తదితర వ్యక్తిగత సమాచారం ఇచ్చాడు. గుర్తు తెలియని వ్యక్తి లింక్‌ పంపి దాని ద్వారా క్రెడిట్‌ కార్డు కోసం వాట్సాప్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంతో చంద్రకాంత్‌(Chandrakanth) మరిన్ని వ్యక్తిగత వివరాలు పంపాడు. ఆ తర్వాత గుర్తు తెలియని వ్యక్తి ఓ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోమన్నాడు.


చంద్రకాంత్‌ అనుమానం వ్యక్తం చేయడంతో అతడు క్రెడిట్‌ కార్డు ప్రాసెస్‌ కోసం అంటూ నమ్మించాడు. బ్యాంకు ఖాతాకు లింకైన మొబైల నంబర్‌ సహా, డెబిట్‌ కార్డు వివరాలు, ఫోన్‌కు వచ్చిన ఓటీపీ కూడా గుర్తు తెలియని వ్యక్తికి షేర్‌ చేశాడు. రాత్రి అతడి ఫోన్‌కు పలు మార్లు ఓటీపీలు వచ్చాయి. మొత్తం రూ.1,00,450 తన ఖాతా నుంచి బదిలీ అయ్యాయని గుర్తించాడు. వెంటనే తన డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేశాడు. బ్యాంకు అధికారుల సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 07:11 AM