Cyber criminals: పార్శిల్‌లో చట్టవ్యతిరేక వస్తువులంటూ బెదిరింపు రూ.6.90 లక్షలు కాజేశారు..
ABN, Publish Date - Nov 16 , 2024 | 08:05 AM
డీహెచ్‌ఎల్ కొరియర్ సర్వీసు పేరుతో ముంబై నుంచి చైనాకు వెళ్తున్న పార్శిల్‌లో చట్టవ్యతిరేక వస్తువులు దొరికాయంటూ నగరానికి చెందిన యువకుడిని సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) బెదిరించి రూ. 6.90 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
- యువకుడి నుంచి రూ.6.90 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: డీహెచ్‌ఎల్ కొరియర్ సర్వీసు పేరుతో ముంబై నుంచి చైనాకు వెళ్తున్న పార్శిల్‌లో చట్టవ్యతిరేక వస్తువులు దొరికాయంటూ నగరానికి చెందిన యువకుడిని సైబర్ కేటుగాళ్లు(Cyber criminals) బెదిరించి రూ. 6.90 లక్షలు కాజేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 28 ఏళ్ల యువకుడికి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. తన పేరుతో ఉన్న పార్శిల్‌లో మాదక ద్రవ్యాలు ఉండటంతో క్రైమ్ బ్రాంచి పోలీసులు కేసు నమోదు చేశారని నమ్మించారు.
ఈ వార్తను కూడా చదవండి: Rani Rudramadevi: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు.. అయితే..
కాల్‌ను క్రైమ్ బ్రాంచి పోలీసులకు బదిలీ చేశామని.. స్కైప్‌కాల్‌లో మాట్లాడాలని ఆదేశించారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తులు మాట్లాడారు. నరేష్‌గోయల్(Naresh Goyal)కు చెందిన కోట్ల రూపాయల జెట్ ఎయిర్‌వేస్ మనీల్యాండరింగ్ కేసులో మీ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలున్నాయని, విచారించి అరెస్టు చేస్తామని బెదిరించారు. తాను పార్శిల్ పంపలేదని అతడు చెప్పినా వినిపించుకోలేదు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును వెంటనే ఆర్‌బీఐ(RBI)కి బదిలీ చేయాలని, మనీ ల్యాండరింగ్‌లో ప్రమేయం లేదని తేలితే తిరిగి జమ చేస్తామని నమ్మించారు.
ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని, బయటకు చెబితే ఏడేళ్ల జైలు శిక్ష తప్పదని బెదిరించారు. బాధితుడి తల్లి, సోదరి ఫొటోలతో పాటు.. గ్యాలరీ చూపించాలంటూ ఫొటోలను చూసి ఆరా తీశారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 6.90 లక్షలు నిందితులు చెప్పిన ఖాతాలోకి జమ చేశాడు. ఆ తర్వాత ఎవరూ స్పందించకపోవడం, డబ్బులు తిరిగి తన ఖాతాలోకి బదిలీ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ ఓ రాబందు..
ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు
ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు
ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి
Read Latest Telangana News and National News
Updated Date - Nov 16 , 2024 | 08:05 AM