ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: అధిక లాభాలంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి టోకరా

ABN, Publish Date - Dec 10 , 2024 | 08:19 AM

షేర్‌ మార్కెట్‌(Share market)లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 8.41 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals). నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(45)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు.

- షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో..

- రూ.8.41 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: షేర్‌ మార్కెట్‌(Share market)లో పెట్టుబడి పెడితే అధిక లాభాలంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 8.41 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals). నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి(45)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయంటూ వేర్వేరు కంపెనీల్లో షేర్‌లు కొనుగోలు చేయించాడు. ఆ తర్వాత అమెరికాకు చెందిన దిగ్గజ షేర్‌ మార్కెట్‌ కంపెనీ ప్రోవెక్స్‌ ఫిన్‌టెక్‌(Provex Fintech)లో పెట్టుబడులు పెడితే అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని,

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 9 కేసుల్లో మోస్టు వాంటెడ్‌..


బాధితుడిని రిజిస్టర్‌ చేయించినట్టు నమ్మించి పెట్టుబడి పెట్టడానికి ఒప్పించాడు. రూ. 8.41 లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత విత్‌డ్రా ఆప్షన్‌ తొలగించారు. ఇదేంటని బాధితుడు ప్రశ్నిస్తే.. 30 శాతం ట్యాక్స్‌ చెల్లించాలన్నాడు. తర్వాత వెబ్‌సైట్‌ లింక్‌ను బ్లాక్‌ చేశారు. మోసం జరిగిందని గుర్తించిన బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: మూసీ నిర్వాసితులకు రూ. 2 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: ఆశ వర్కర్లపై పోలీసుల దాష్టీకం

ఈవార్తను కూడా చదవండి: Sangareddy: సోనియా,రాహుల్‌ ఇచ్చిన మాట తప్పరు

ఈవార్తను కూడా చదవండి: మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 10 , 2024 | 08:19 AM