ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: ‘బ్యాంక్‌ స్కామ్‌లో మీకు లింకు ఉంది’

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:32 AM

క్రెడిట్‌ కార్డు(Credit card) లేకున్నా బిల్లు కట్టాలని బెదిరించాడు. ఇంకో వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడించి బ్యాంక్‌స్కామ్‌లో మీ పాత్ర ఉన్నదని భయపెట్టి ఓ యువకుడి నుంచి రూ.5 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన ఓ యువకుడి (28)కి ఈనెల 19న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది.

- వీడియో కాల్‌లో బెదిరింపు

- రూ.5 లక్షలు కొల్లగొట్టిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: క్రెడిట్‌ కార్డు(Credit card) లేకున్నా బిల్లు కట్టాలని బెదిరించాడు. ఇంకో వ్యక్తితో వీడియో కాల్‌లో మాట్లాడించి బ్యాంక్‌స్కామ్‌లో మీ పాత్ర ఉన్నదని భయపెట్టి ఓ యువకుడి నుంచి రూ.5 లక్షలు దోచేశారు. నగరానికి చెందిన ఓ యువకుడి (28)కి ఈనెల 19న గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. ‘మీ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు బిల్లు రూ.95 వేలు ఎప్పుడు చెల్లిస్తారు’ అని ప్రశ్నించారు. తనకు క్రెడిట్‌ కార్డే లేదని, బిల్లు ఎక్కడిదని ప్రశ్నించారు. దీంతో రూట్‌ మార్చిన ఆ వ్యక్తి ఒక నంబర్‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడమని సూచించాడు.

ఇదికూడా చదవండి: Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు


నిజమని నమ్మిన ఆ యువకుడు వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. ‘రూ.2.5 కోట్ల కెనరా బ్యాంకు కుంభకోణంలో మీకు లింకు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. మీపై క్రిమినల్‌ కేసు నమోదైంది. అరెస్టు వారెంట్‌ కూడా జారీ అయ్యింది. ఈ స్కామ్‌లో మీ పాత్ర లేదని నిరూపించుకోవాలంటే మీ ఖాతాలో నిల్వలను బదిలీ చేయండి’ అని బెదిరించాడు. ఇదంతా నిజమేనని నమ్మిన ఆ యువకుడు తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 5 లక్షలను బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి మంగళవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులను(Cyber ​​crime police) ఆశ్రయించాడు.


.......................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Mainampally: హరీశ్‌రావు.. నీ మీద నేనే పోటీ చేస్తా... ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా

- లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటావా ?

- సిద్దిపేట ఎవరి అబ్బ సొత్తు కాదు: మైనంపల్లి

సిద్దిపేట: ‘ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్యే హరీశ్‌రావు(MLA Harish Rao) రాజీనామా చేయాలి. సిద్దిపేటలో నీ మీద నేనే పోటీ చేస్తా. నేను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఓడిపోతే నువ్వు కూడా తప్పుకుంటావా’ అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హనుమంతరావు(Mainampalli Hanumantha Rao).. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు సవాల్‌ విసిరారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని పొన్నాల వద్ద రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహనికి మైనంపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అనంతరం సిద్దిపేట(Siddipet) పాత బస్టాండ్‌ వరకు వాహనాలతో ర్యాలీగా వెళ్లి, అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మైనంపల్లి పీడ పోవాలంటే హరీశ్‌రావు రాజీనామా చేయాల్సిందే. మీ జోలికి వస్తే కారం, రాళ్లతో కొట్టాలని చెబుతారా? మా కార్యకర్తల జోలికొస్తే మేమూ ప్రతిదాడులు చేస్తాం. తెలంగాణ, సిద్దిపేట ఎవరబ్బ సొత్తు కాదు. పదేళ్లు అధికారంలో ఉండి లక్షల కోట్లు దోచుకున్నారు. మిమల్ని జైలుకు పంపే వరకు సీఎం రేవంత్‌రెడ్డి నిద్రపోరు. బీఆర్‌ఎస్‌ను నమ్మి నాలాగా ఎంతోమంది మోసపోయారు. కల్వకుంట్ల కుటుంబం 1200 మంది అమరుల కుటుంబాల ఉసురు తీసుకున్నది’ అని ధ్వజమెత్తారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 21 , 2024 | 09:32 AM

Advertising
Advertising
<