GHMC: నలుగురు జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల అరెస్టు.. కారణం ఏంటంటే..
ABN, Publish Date - Aug 01 , 2024 | 11:48 AM
జీహెచ్‌ఎంసీ(GHMC)కి చెందిన నలుగురు ఉద్యోగులు ఫోర్జరీ, చీటింగ్ కేసులో బుధవారం అరెస్టు అయ్యారు. లేని ఆస్తులకు ఫోర్జరీ పత్రాలు సమర్పించి రూ.5.78 కోట్ల విలువైన టీడీఆర్(ట్రాన్స్‌ఫర్ డెవల్‌పమెంట్ రైట్స్)లు పొందిన వారికి సహకరించారన్న ఆరోపణలపై రాజేంద్రనగర్ పోలీసులు(Rajendranagar Police) ఈ చర్యలు తీసుకున్నారు.
- ఫోర్జరీ పత్రాలతో రూ.5.78 కోట్ల టీడీఆర్‌ల జారీ కేసులో..
హైదరాబాద్ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC)కి చెందిన నలుగురు ఉద్యోగులు ఫోర్జరీ, చీటింగ్ కేసులో బుధవారం అరెస్టు అయ్యారు. లేని ఆస్తులకు ఫోర్జరీ పత్రాలు సమర్పించి రూ.5.78 కోట్ల విలువైన టీడీఆర్(ట్రాన్స్‌ఫర్ డెవల్‌పమెంట్ రైట్స్)లు పొందిన వారికి సహకరించారన్న ఆరోపణలపై రాజేంద్రనగర్ పోలీసులు(Rajendranagar Police) ఈ చర్యలు తీసుకున్నారు. పీడీపీ చౌరస్తా పిల్లర్ నెంబర్ 213 నుంచి గండిపేట్ మండలం, కిస్మత్‌పూర్ బస్తీ వైపు రహదారి విస్తరణ పనులకు జీహెచ్‌ఎంసీ((GHMC)) ఆస్తులు సేకరించింది. అయితే, ఉప్పర్‌పల్లి సర్వేనెంబర్ 43, 44, 46లో తమ స్థలం ఉందని ముక్రమ్, అశ్వక్, ముఖదిర్ అనే వ్యక్తులు ఫోర్జరీ డాక్యుమెంట్లు జీహెచ్‌ఎంసీకి సమర్పించి రూ.5.78 కోట్ల విలువైన టీడీఆర్ పొందారు.
ఇదికూడా చదవండి: Secunderabad: సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలి...
సంబంధిత భూమికి అసలు యజమాని ఈ విషయం తెలుసుకుని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం బయటపడగా ముక్రమ్, అశ్వక్‌ను పది రోజుల క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు సహకరించిన రాజేంద్రనగర్ సర్కిల్ జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ మహ్మద్ కబీరుల్లాఖాన్, డిప్యూటీ సిటీ ప్లానర్ ఎన్.కృష్ణమోహన్, జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలోని ల్యాండ్ అక్విజిషన్ విభాగంలో సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివా్‌సరెడ్డి, ల్యాండ్ అక్విజిషన్ సర్వేయర్ ఎ.దీపక్ కుమార్‌ను బుధవారం అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు రూ.5.78 కోట్ల టీడీఆర్‌లో మెజార్టీ విక్రయించినట్టు గుర్తించారు. వారి నుంచి డబ్బు రికవరీ చేసేందుకు పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా, వివిధ అభివృద్ధి పనుల నిర్వహణలో భాగంగా జీహెచ్‌ఎంసీ గత పదేళ్లలో రూ.5000 కోట్ల విలువైన టీడీఆర్‌లు జారీ చేసింది.
ఆర్థిక ఇబ్బందులతో పరిహారం చెల్లింపు భారంగా మారుతుండడంతో జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌ల జారీకి శ్రీకారం చుట్టింది. పట్టా భూములు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న స్థలాలకు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయ విలువలో 400 శాతం, చెరువులు, నాలాల బఫర్ జోన్‌లో ఉన్న ఆస్తులకు 200 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. భవన నిర్మాణ అనుమతులు, నివాసయోగ్య పత్రాల (ఓసీ) జారీ రుసుము చెల్లింపునకు టీడీఆర్‌లను వినియోగించుకునే అవకాశం కల్పించింది. అయితే, నకిలీ పత్రాలు టీడీఆర్‌లు పొందిన విషయం బయటికి రావడంతో గతంలోనూ ఇదే తరహా అక్రమాలు ఏమైనా జరిగాయా ? అనే అంశంపై అధికారులు దృష్టి సారించారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Updated Date - Aug 01 , 2024 | 11:48 AM