ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: సరికొత్త ‘సైబర్’ మోసం వెలుగులోకి.. ఎలా జరిగిందంటే..

ABN, Publish Date - Nov 19 , 2024 | 07:49 AM

సరికొత్త సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్‌ బాయ్‌ అనుచిత ప్రవర్తనపై కస్టమర్‌ ఫిర్యాదు చేస్తే.. నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అతడి ఖాతా నుంచి రూ. 4.68 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత(సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి ఫ్లిప్‌కార్ట్‌ పార్శిల్‌ వచ్చింది. కొరియర్‌ బాయ్‌ కస్టమర్‌ను పేరు పెట్టి గట్టిగా పిలిచాడు.

- కొరియర్‌ బాయ్‌ అనుచిత ప్రవర్తన

- సంస్థకు బాధితుడి ఫిర్యాదు

- నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలంటూ లింక్‌

- రూ. 4.68 లక్షలు కాజేసిన సైబర్‌ నేరగాళ్లు

హైదరాబాద్‌ సిటీ: సరికొత్త సైబర్‌ మోసం వెలుగులోకి వచ్చింది. కొరియర్‌ బాయ్‌ అనుచిత ప్రవర్తనపై కస్టమర్‌ ఫిర్యాదు చేస్తే.. నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) అతడి ఖాతా నుంచి రూ. 4.68 లక్షలు కాజేశారు. సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత(సైబర్‌ క్రైమ్‌ డీసీపీ కవిత) తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి ఫ్లిప్‌కార్ట్‌ పార్శిల్‌ వచ్చింది. కొరియర్‌ బాయ్‌ కస్టమర్‌ను పేరు పెట్టి గట్టిగా పిలిచాడు.

ఈ వార్తను కూడా చదవండి: Trains: పలు రైళ్లకు నంబర్ల మార్పు.. మార్చి 1 నుంచి అమల్లోకి


ఉలిక్కిపడ్డ బాధితుడు ఎందుకు అలా కేక వేస్తున్నావని నిలదీయగా అనుచితంగా ప్రవర్తించాడు. బాధితుడు కొరియర్‌ సర్వీసుకు ఫోన్‌ చేసి బాయ్‌ ప్రవర్తన గురించి చెప్పాడు. మీ ఫిర్యాదు నమోదు చేయాలంటే రూ. 10 చెల్లించాలని చెప్పి ఏపీకే ఫైల్‌ (ఆండ్రాయిడ్‌ ప్యాకేజీ కిట్‌) లింకును పంపాడు. బాధితుడు ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి రూ. 10 చెల్లించడానికి ప్రయత్నించాడు. అప్పటికే ఫోన్‌ హ్యాక్‌ చేసిన క్రిమినల్స్‌ అతడి ఖాతా నుంచి డబ్బులు కాజేశారు. డబ్బులు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ రాగానే బాధితుడు ఇదేంటని ప్రశ్నించాడు.


కంగారు పడొద్దని, మీ డబ్బులు తిరిగి చెల్లిస్తామని నమ్మించారు. ఫోన్‌ ఆఫ్‌ చేయొద్దని సూచించారు. మరోసారి డబ్బులు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. బాధితుడు కంగారుపడి ఖాతాను పరిశీలించగా.. రూ. 4,68,690 డెబిట్‌ అయినట్లు గుర్తించాడు. రూ. 10 చెల్లించాలని చెప్పిన కొరియర్‌ సర్వీస్‌ వారు రూ. 4.68 లక్షలు కాజేయడంతో బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ఈవార్తను కూడా చదవండి: KTR: మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ..

ఈవార్తను కూడా చదవండి: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: బీఆర్‌ఎస్‌ హయాంలో సర్వేతో దోపిడీ

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: నియంతలా సీఎం రేవంత్‌ ప్రవర్తన

Read Latest Telangana News and National News

Updated Date - Nov 19 , 2024 | 07:49 AM