ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కోకాపేటలో బ్లాస్టింగ్‌ కలకలం..

ABN, Publish Date - Dec 21 , 2024 | 08:12 AM

కోకాపేట(Kokapet)లో ఓ నిర్మాణ సంస్థ జరిపిన బ్లాస్టింగ్స్‌ తీవ్ర కలకలం రేపింది. నియోపోలీస్‌ ప్లాట్‌ నంబర్‌-3(Neopolis Plot No. 3) వద్ద సినిమా షూటింగ్‌ తరహాలో ఏకకాలంలో పదిచోట్ల జరిపిన డిటొనేటర్ల(Detonators) పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.

- నియోపోలీస్‌ వద్ద పేలుళ్లు జరిపిన నిర్మాణ సంస్థ

- ఎగిరిపడిన బండరాళ్లు, పలువురికి గాయాలు

హైదరాబాద్‌ సిటీ: కోకాపేట(Kokapet)లో ఓ నిర్మాణ సంస్థ జరిపిన బ్లాస్టింగ్స్‌ తీవ్ర కలకలం రేపింది. నియోపోలీస్‌ ప్లాట్‌ నంబర్‌-3(Neopolis Plot No. 3) వద్ద సినిమా షూటింగ్‌ తరహాలో ఏకకాలంలో పదిచోట్ల జరిపిన డిటొనేటర్ల(Detonators) పేలుళ్లతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. బండరాళ్లు ఎగిరిపడడంతో రోడ్డుపై ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అక్కడే లేబర్‌ క్యాంపులో ఉన్న కార్మికులు గాయపడినట్లు, వారు వినియోగించే వంట పాత్రలు చెల్లాచెదురుగా పడిపోయినట్లు తెలిసింది

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సైకో చేష్టలు.. భార్యను గొంతునులిమి చంపిన భర్త..


అయ్యప్ప స్వాములకు తప్పిన ముప్పు..

కోకాపేటలోని నియో పోలీస్‌ సమీపంలో అయ్యప్ప స్వాముల శిబిరం ఉంది. బండరాళ్లు ఎగిరి అయ్యప్ప స్వాముల దీక్షా శిబిరంపై పడడంతో పలువురు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదు మేరకు నార్సింగ్‌ పోలీసులు(Narsingh Police) కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రందించగా.. నిర్మాణ సంస్థకు అన్ని రకాల అనుమతులు ఉన్నట్లు చెప్పారు. జనసమ్మర్థం ఉన్న సమయంలో, రక్షణ చర్యలు తీసుకోకుండా పేలుళ్లు ఎలా జరుపుతారనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. విచారణ అనంతరం చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 08:12 AM