Hyderabad: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం..
ABN, Publish Date - Dec 21 , 2024 | 06:59 AM
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యానగర్(Vidyanagar)కు చెందిన రాజయ్య ప్రైవేటు ఉద్యోగి.
- మరొకరికి తీవ్రమైన గాయాలు
హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) ఢీకొట్టడంతో బీటెక్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో విద్యార్ధి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యానగర్(Vidyanagar)కు చెందిన రాజయ్య ప్రైవేటు ఉద్యోగి. అతడి కుమారుడు లోకేష్(21) బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు స్నేహితుడు ధర్మతేజతో కలిసి శుక్రవారం స్కూటీ పై బయలు దేరాడు. అమీర్‌పేట్(Ameerpet) వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరూ గాల్లోకి లేచి కిందపడ్డారు.
ఈ వార్తను కూడా చదవండి: CCI: మద్యం అమ్మకాల్లో బహుమతుల ఎర
లోకేష్(Lokesh) తలకు తీవ్రమైన గాయమవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ధర్మతేజను ఆస్పత్రికి తరలించారు. ట్రావెల్ బస్సు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు(Panjagutta Police) ఘటనా స్థలానికి చేరుకొని లోకేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ట్రావెల్ బస్సును గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది
ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌పై హరీష్ విసుర్లు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 21 , 2024 | 06:59 AM