Hyderabad: పూటకో వేషం.. రోజుకో మోసం.. డబ్బున్న అమ్మాయిలే టార్గెట్
ABN, Publish Date - Dec 19 , 2024 | 01:53 PM
పూటకో వేషం.. రోజుకో మోసంతో మ్యాట్రిమోనీ(Matrimony)లో అమ్మాయిలను మోసం చేసి రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న మోసగాడిపై రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన వంశీకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
- పెళ్లి చేసుకుంటానని మ్యాట్రిమోనీలో నమ్మించి మోసం
- రూ.లక్షల్లో వసూలు చేసి ఉడాయిస్తున్న ఘనుడు
- రాయదుర్గం పరిధిలో కేసు నమోదు
హైదరాబాద్: పూటకో వేషం.. రోజుకో మోసంతో మ్యాట్రిమోనీ(Matrimony)లో అమ్మాయిలను మోసం చేసి రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న మోసగాడిపై రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన వంశీకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. జల్సాలకు, లగ్జరీ జీవితానికి అలవాటుపడిన వంశీ ఐటీ కారిడార్‌లోని ఖరీదైన ప్రాంతాల్లో నివాసం ఉంటాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు మ్యాట్రిమోనీ సైట్లను అడ్డాగా చేసుకున్నాడు. వాటిల్లో పెళ్లి కోసం ప్రొఫైల్ ఆప్‌లోడ్ చేసుకున్న అందమైన, సంపన్నులైన అమ్మాయిలను టార్గెట్ చేస్తాడు.
ఈ వార్తను కూడా చదవండి: వివాహేతర సంబంధం.. చివరికి ఆత్మహత్యకు దారితీసింది..
తలకు రకరకాల విగ్గులు ధరించి ఫొటోలు దిగి, అందమైన ఫొటోలతో సంపన్నుడిగా చెలామణి అవుతూ ప్రొఫైల్ అప్‌లోడ్ చేస్తాడు. ఆ తర్వాత డబ్బున్న అమ్మాయిల కాంటాక్ట్ నంబర్‌లకు ఫోన్ చేసి పరిచయం పెంచుకుంటాడు. తన గారడీ మాటలతో ఆకుట్టుకుంటాడు. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తెస్తాడు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులతో పరిచయం పెంచుకుంటాడు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత పెళ్లి పనులకు డబ్బులు అవసరం అయిందనో, పెళ్లి కూతరుకు మంచి నగలు చేయిస్తాననో నమ్మించి రూ. లక్షల్లో డబ్బులు లాగేసి ఉడాయిస్తాడు. ఇలా రాయదుర్గం(Rayadurgam) పరిధిలోని ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ. 25 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత మోసం చేశాడు.
అతడి వివరాలు సేకరించిన బాధితులు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని గాలించి పట్టుకున్నారు. దాంతో కాళ్ల బేరానికి వచ్చాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని తనను వదిలేయాలని అమ్మాయిని, ఆమె తల్లిదండ్రులను బతిమిలాడి ఒప్పించుకున్నాడు. తీసుకున్న డబ్బులకు చెక్కులు ఇచ్చాడు. సరే అని అమ్మాయి తరఫు వారు చెప్పడంతో అక్కడి నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత పోలీసులపైనే ఉల్టా కోర్టులో రిట్ వేశాడు. పోలీసులు బలవంతంగా తన నుంచి డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేశారని పేర్కొన్నాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు అతడి నుంచి వివరాలు సేకరించారు. నేడు అరెస్ట్ చేయనున్నట్లు తెలిసింది.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2024 | 01:53 PM