Hyderabad: 22 నిమిషాల్లో.. 21.24 లక్షలు ఫ్రీజ్
ABN, Publish Date - Jul 13 , 2024 | 11:25 AM
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్ అవర్(Golden hour)లో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.
- గోల్డెన్ అవర్‌లో ఎన్‌సీఆర్‌పీకి బాధితుల ఫిర్యాదు
- సైబర్ నేరగాళ్లకు చిక్కిన సొమ్ము రికవరీ
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్ అవర్(Golden hour)లో ఎన్‌సీఆర్‌పీ (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్)లో, లేదా 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది. తద్వారా డబ్బును వెనక్కి రప్పించే అవకాశం ఉంటుంది. గత మూడు రోజుల్లో జరిగిన మూడు సంఘటనల్లో బాధితులు గోల్డెన్ అవర్‌లో స్పందించడం వల్లే సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టిన రూ. 21.24లక్షలు సైబర్ క్రైమ్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. పోగొట్టుకున్న డబ్బును రికవరీ చేయడంతో బాధితుల ఆనందానికి అవధుల్లేవు. పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత ధార వెల్లడించారు.
ఇదికూడా చదవండి: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
- రూ. 17.45లక్షలు పోగొట్టుకున్న వైద్యుడు
ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులం అంటూ మాట్లాడి, మనీల్యాండరింగ్(Money laundering) కేసులో మీ పాత్ర ఉన్నట్లు తేలిందని, మీ ఖాతా నుంచి అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని నగరానికి చెందిన ఓ వైద్యుడిని బెదిరించి, భయపెట్టిన సైబర్ నేరగాళ్లు జూలై-9న రూ. 17,45,0413 కొల్లగొట్టారు. వెంటనే తేరుకున్న డాక్టర్.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎన్‌సీఆర్‌పీలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన డ్యూటీ ఆఫీసర్ ఎండీ జావీద్ బాధితుడు కంప్లైంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. డబ్బులు చెల్లించిన బ్యాంకు ఖాతా నుంచి ఆ డబ్బులు ఏ ఖాతాలకు జమయ్యాయో చూసి వెంటనే వాటిని స్తంభింపజేయాలని సంబంధింత బ్యాంకు అధికారులను సూచించారు. దాంతో బ్యాంకు అధికారులు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా బాధితుడు పోగొట్టుకున్న రూ. 17.45లక్షల డబ్బును కేవలం 22 నిమిషాల్లోనే ఫ్రీజ్ చేశారు. డబ్బును ఫ్రీజ్ చేసిన విషయం తెలియగానే బాధితుడి ప్రాణం లేచి వచ్చినట్లయింది.
- మరో కేసులో ఈనెల 11న సైబర్ నేరగాళ్ల బారినపడిన నగరవాసి రూ. 3.79 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే ఎన్‌సీఆర్‌పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ శ్రీకాంత్ నాయక్ వెంటసే స్పందించి సంబంధిత బ్యాంకు అధికారులను అప్రమత్తం చేశారు. వారి సహకారంతో కేవలం 21 నిమిషాల్లోనే మొత్తం రూ.3.79 లక్షలు ఫ్రీజ్ చేశారు.
- మరో కేసులో పోలీసులు బాధితుడు పోగొట్టుకున్న రూ.97,312 రికవరీ చేశారు. 11వతేదీ అర్ధరాత్రి నగరానికి చెందిన వ్యక్తి సైబర్ నేరం బారినపడి రూ.97,312లు పోగొట్టుకున్నాడు. వెంటనే తేరుకొని రాత్రిపూట హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ బి.సందీప్ వెంటనే స్పందించి టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ఆ డబ్బును రికవరీ చేశారు.
ఇదికూడా చదవండి: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jul 13 , 2024 | 11:25 AM