ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పంజాబ్‌ నుంచి నగరానికి గంజాయి చాక్లెట్లు..

ABN, Publish Date - Sep 24 , 2024 | 10:31 AM

అధిక సంపాదన కోసం పంజాబ్‌(Punjab) నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్తుడిని మాదాపూర్‌ ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు(Madapur SOT, Petbashirabad Police) అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.02 లక్షల విలువైన గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్‌ సిటీ: అధిక సంపాదన కోసం పంజాబ్‌(Punjab) నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్న పాత నేరస్తుడిని మాదాపూర్‌ ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు(Madapur SOT, Petbashirabad Police) అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.02 లక్షల విలువైన గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌ జోన్‌ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం పంజాబ్‌కు చెందిన తమ్కిస్సార్‌ సింగ్‌(55) కుటుంబం కొంతకాలం క్రితం వలస వచ్చి సూర్యాపేట(Suryapet)లో స్థిరపడ్డారు. తమ్కిస్కార్‌ సింగ్‌ 1 0ఏళ్ల కిత్రం గాజులరామారం ప్రాంతానికి వచ్చాడు. గృహోపకరణాలు తయారు చేస్తూ విక్రయించేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన తమ్కిస్కార్‌ సింగ్‌ ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి విక్రయాలు ప్రారంభించాడు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రూ.50 లక్షల వైద్యం.. నిమ్స్‌లో ఉచితం


రెండు సార్లు అరెస్టయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయినా తీరు మార్చుకోకుండా గంజాయి చాక్లెట్ల విక్రయం ప్రారంభించాడు. పంజాబ్‌ రాణీపూర్‌ జిల్లా ఆనంద్‌పూర్‌ సాహిబ్‌లో గుర్తుతెలియని వ్యక్తి నుంచి గంజాయి చాక్లెట్లు కొనుగోలు చేస్తున్నాడు. ఒక్కో గంజాయి చాక్లెట్‌ రూ.40 చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ విషయం గురించి పక్కా సమాచారంతో మాదాపూర్‌ ఎస్‌ఓటీ, పేట్‌బషీరాబాద్‌ పోలీసులు వలపన్ని అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 12.7 కేజీల గంజాయి చాక్లెట్స్‌, 680 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు.


రామిరెడ్డినగర్‌లో ఏడుగురి అరెస్ట్‌

జీడిమెట్ల: జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతం రామిరెడ్డినగర్‌లోని ఓ ఇంట్లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని, గంజాయి తాగుతున్న ఆరుగురిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి నుంచి 850 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్‌ షేక్‌ ఆలీ(26) డ్రైవర్‌. రామిరెడ్డినగర్‌లో నివాసముంటున్నాడు. మహారాష్ర్టాలోని నాగపూర్‌ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నాడు. సోమవారం సేవిస్తున్న మరో ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.


................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................

MLA హైడ్రా ఓ పెద్ద హైడ్రామా: ఎమ్మెల్యే

హైదరాబాద్: హైడ్రా చర్యలతో మధ్య తరగతి ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అన్నారు. కూకట్‌పల్లి నల్లచెరువులో ఆదివారం హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పందించారు. తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. శనివారం, ఆదివారం వస్తుందం టే హైదరాబాద్‌లో ప్రజలు భయంతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, హైడ్రా కమిషనర్‌ వ్యాఖ్యలకు ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు.


హైడ్రా కూల్చివేతలు చేశాక నిర్మాణ వ్యర్థాలు తీసివేయకుండా, చెత్తను జమ చేస్తున్నారని, వాటిని తీయకుండా చెరువును ఏవిధంగా కాపాడుతారని ప్రశ్నించారు. నల్లచెరువులో కూల్చివేతలు చేపట్టిన స్థలం పట్టాదారులకు చెందిందని, పట్టాదారులకు ఏ విధమైన న్యాయం చేయనున్నారని చెరువులలో పట్టాలు ఉన్న వారికి నష్టపరిహారం చెల్లించి ఆ స్థలాన్ని ప్రభుత్వం తీసుకొని చెరువులను కాపాడుతూ అభివృద్ధి చేయాలని సూచించారు. కూల్చివేతలతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లిం చి వారిని ఆదుకోవాలని కోరారు.


ఇదికూడా చదవండి: Congress: డీసీసీ కార్యాలయాలకు స్థలాలు!

ఇదికూడా చదవండి: Regional Ring Road: ఆర్‌ఆర్‌ఆర్‌కు వరల్డ్‌ బ్యాంక్‌ నిధులు..

ఇదికూడా చదవండి: Hanumakonda: కొడుకులు తిండి పెట్టట్లేదు.. మా భూమిని తిరిగి ఇప్పించండి సారూ!

Read Latest Telangana News and National News

Updated Date - Sep 24 , 2024 | 10:31 AM