Hyderabad: దైవ దర్శనానికి వెళ్లివస్తూ అనంతలోకాలకు..
ABN, Publish Date - Dec 19 , 2024 | 07:45 AM
శబరిమల(Shabari mala) దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రనగర్(Rajendranagar)కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్రమైనగాయాలు కాగా మరొకరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు.
- తమిళనాడులో రోడ్డు ప్రమాదం
- రాజేంద్రనగర్‌కు చెందిన ఇద్దరి దుర్మరణం
- మరో ఇద్దరికి గాయాలు
హైదరాబాద్: శబరిమల(Shabari mala) దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేంద్రనగర్(Rajendranagar)కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్రమైనగాయాలు కాగా మరొకరు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బాబుల్‌రెడ్డినగర్‌కు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ పోతన్న(50), బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ సీతారాం నాయక్(50)తోపాటు ఆయన కుమారుడు చరణ్, స్నేహితుడు శ్రీరాంనగర్(Sriramnagar)కు చెందిన శివకుమార్ గౌడ్(50)తో కలిసి ఈనెల 16న కారులో శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లారు.
ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: ఆక్రమణదారులపై పీడీ యాక్ట్.. హైడ్రా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు తర్వాత చర్యలు
దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా బుధవారం తెల్లవారుజామున తేనీ దేవదాన తట్టి అనే ప్రాంతంలో ఎదురుగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో డాక్టర్ పోతన్న, డాక్టర్ సీతారాంనాయక్(Dr. Pothana, Dr. Seetharam Nayak) అక్కడికక్కడే మృతిచెందారు. శివకుమార్‌గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చరణ్ మధురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద విషయం తెలియగానే బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతం నుంచి స్థానిక నాయకుడు దత్తుతోపాటు 11 మంది తమిళనాడు వెళ్లారు.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News
Updated Date - Dec 19 , 2024 | 07:45 AM