Hyderabad: లింక్ ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ కావడం ఖాయం..
ABN, Publish Date - Aug 04 , 2024 | 10:37 AM
సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మరో కొత్తరకం మోసానికి తెరతీశారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(State Bank of India)లో ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఎస్‌బీఐ రివార్డు పాయింట్స్(SBI Reward Points) పేరుతో ఒక నకిలీ మెసేజ్‌ను సర్క్యులేట్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ‘
- ఎస్‌బీఐ ఖాతాదారులకు రివార్డు పాయింట్స్ పేరుతో నకిలీ మెసేజ్‌లు
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరగాళ్లు(Cyber criminals) మరో కొత్తరకం మోసానికి తెరతీశారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(State Bank of India)లో ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్న కేటుగాళ్లు ఎస్‌బీఐ రివార్డు పాయింట్స్(SBI Reward Points) పేరుతో ఒక నకిలీ మెసేజ్‌ను సర్క్యులేట్ చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ‘‘ప్రియమైన వినియోగదారులారా..! మీ ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్ రివార్డు పాయింట్లు (9980.00) గడువు నేటితో ముగుస్తుంది. వెంటనే ఎస్‌బీఐ రివార్డు యాప్ ఇన్‌స్టాల్ ద్వారా రిడీమ్ చేసుకోండి. నేరుగా మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుంది.’’ అంటూ నకిలీ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: కబ్జాదారుల బరితెగింపు.. హెచ్‌ఎండీఏ భూముల ఆక్రమణకు యత్నం
వచ్చిన మెసేజ్ నిజమని నమ్మి లింక్‌ను ఓపెన్ చేసి ఎస్‌బీఐ రివార్డు యాప్ డౌన్‌లోడ్(SBI Rewards App Download) చేసుకుంటే వెంటనే ‘మీ ఫోన్‌ను సైబర్ నేరగాళ్లు(Cyber criminals) హ్యాక్ చేస్తారు. దాంతో మీ ఫోన్ కంట్రోలింగ్ వారి చేతికి వెళ్తుంది. ఫోన్‌లో మీరు ఎస్‌బీఐ ఖాతా వివరాలు నమోదు చేయగానే వారు ఖాతాలో ఉన్న డబ్బు ఖాళీ చేస్తారు’ అని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ఎస్‌బీఐ ఖాతాదారులు ఈ మోసపూరితమైన మెసేజ్‌లు నమ్మొద్దని, ఎలాంటి యాప్‌లు, లింక్‌లు ఫోన్‌లో ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు
ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Updated Date - Aug 04 , 2024 | 10:37 AM