Hyderabad: ఎస్‌బీఐ రివార్డు పాయింట్లంటూ.. ప్రభుత్వ ఉద్యోగినికి టోకరా
ABN, Publish Date - Jun 21 , 2024 | 08:53 AM
ఎస్‌బీఐ రివార్డు పాయింట్ల(SBI Reward Points) పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగినిని, పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి మరో వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. పార్శిల్ బాధితుడి ఖాతా నుంచి రూ. 15.36 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగిని ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచేశారు.
- ఆమె ఖాతా నుంచి రూ. 2.30 లక్షలు మాయం
- పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి మరో వ్యక్తి నుంచి రూ. 15.36 లక్షల దోపిడీ
- సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితులు
హైదరాబాద్ సిటీ: ఎస్‌బీఐ రివార్డు పాయింట్ల(SBI Reward Points) పేరుతో ఓ ప్రభుత్వ ఉద్యోగినిని, పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని భయపెట్టి మరో వ్యక్తిని సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. పార్శిల్ బాధితుడి ఖాతా నుంచి రూ. 15.36 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగిని ఖాతా నుంచి రూ.2.30 లక్షలు దోచేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని (60) ఫోన్‌కు ఎస్‌బీఐ పేరుతో ఓ సందేశం వచ్చింది. ఎస్‌బీఐ యోనో రివార్డు పాయింట్లు వచ్చాయని, ఈ రోజే క్లెయిమ్ చేసుకోమని అందులో ఉంది. ఆమెకు ఎస్‌బీఐ(SBI)లో ఎంతోకాలంగా ఖాతా ఉండటం, జీతం ఖాతా కూడా అదే బ్యాంకులో ఉండటంతో ఆ సందేశాన్ని నమ్మి ఆమె లింక్ ఓపెన్ చేశారు. అందులో ఉన్న సూచనల మేరకు తన ఖాతా వివరాలు, ఇతర వివరాలు నమోదు చేశారు. కొంత సేపటికి ఆమె ఖాతా నుంచి రూ. 2.43 లక్షలు వేరే ఖాతాలకు బదిలీ అయినట్లు సందేశాలు వచ్చాయి. దాంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఉదంతంలో మీ పేరున వచ్చిన పార్సిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని, మీపై కేసు నమోదైందని బెదిరించిన సైబర్ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ. 15.36 లక్షలు కాజేశారు.
ఇదికూడా చదవండి: Minister: గతం కంటే ఘనంగా బోనాల ఉత్సవాలు...
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడికి డీహెచ్‌ఎల్ పేరుతో ఆటోమేటెడ్ కాల్ వచ్చింది. మీ పేరుతో ముంబై నుంచి ఇరాన్‌కు పంపిన పార్సిల్‌ను తిరస్కరించారని, మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు మొబైల్‌లో 1 నొక్కండి అని చెప్పారు. ఇలాంటి మోసాలపై అవగాహన ఉండటంతో బాధితుడు పార్సిల్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని తాను స్వయంగా వచ్చి అధికారులతో కలుస్తానని చెప్పాడు. దాంతో సైబర్ నేరగాడు ఆగ్రహం వ్యక్తం చేసి, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. కాల్‌ను ముంబై క్రైం బ్రాంచ్ అధికారులకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను, వారితో మాట్లాడుకోవాలని సూచించాడు. పోలీస్ దుస్తులతో వీడియో కాల్‌లో పాల్గొన్న వ్యక్తి మీపై కేసు నమోదైందని, కేసు నుంచి తప్పించాలంటే రూ.15.36 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో భయపడి ఆ యువకుడు నగదును సైబర్ నేరస్తుడి ఖాతాకు బదిలీ చేశాడు. అనంతరం మోసపోయానని సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 08:53 AM