ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: భయపెట్టారు.. రూ.32.68 లక్షలు దోచేశారు...

ABN, Publish Date - Jun 23 , 2024 | 10:59 AM

సైబర్‌ నేరగాళ్లు.. రూ.32.68 లక్షల చోరీ చేశారు. ఇరాన్‌కు పంపిన పార్సిల్‌పై ఉన్న వివరాలు మనీ లాండరింగ్‌(Money laundering) కేసుల్లో నమోదై ఉన్నాయని నగరానికి చెందిన మహిళను భయపెట్టి, ఆమె ఖాతా నుంచి రూ.15.76 లక్షలను, గూగుల్‌ మ్యాప్‌కు రేటింగ్‌ ఇస్తే డబ్బులు ఇస్తామని నగరవాసిని నమ్మించి, అతని ఖాతా నుంచి రూ.16.68 లక్షలు కాజేశారు.

హైదరాబాద్‌ సిటీ: సైబర్‌ నేరగాళ్లు.. రూ.32.68 లక్షల చోరీ చేశారు. ఇరాన్‌కు పంపిన పార్సిల్‌పై ఉన్న వివరాలు మనీ లాండరింగ్‌(Money laundering) కేసుల్లో నమోదై ఉన్నాయని నగరానికి చెందిన మహిళను భయపెట్టి, ఆమె ఖాతా నుంచి రూ.15.76 లక్షలను, గూగుల్‌ మ్యాప్‌కు రేటింగ్‌ ఇస్తే డబ్బులు ఇస్తామని నగరవాసిని నమ్మించి, అతని ఖాతా నుంచి రూ.16.68 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తు తెలియని నెంబర్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ప్రముఖ సంస్థ నుంచి ఫోన్‌ చేస్తున్నానని చెప్పిన వ్యక్తి ‘మీ పేరుతో ఇరాన్‌కు పంపిన కొరియర్‌ తిరిగి వచ్చింది. నీకు పార్సిల్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ విషయంపై సైబర్‌ క్రైం(Cybercrime) పోలీసులకు ఫిర్యాదు చేయాలి’ సూచించి, మరో వ్యక్తికి కనెక్ట్‌ చేశాడు. స్కైప్‌ కాల్‌ చేసిన నిందితుడు ‘మీ ఆధార్‌కు లింక్‌ అయిన బ్యాంకు ఖాతాల నుంచి విదేశాలకు అక్రమంగా డబ్బు తరలి వెళ్లింది. మీ ఆధార్‌పై ముంబై అంధేరి పోలీస్టేషన్‌లో పలు కేసులు నమోదయ్యాయి’ అని పత్రాలు చూపాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: చదువు కోసం బెంగళూరుకు వెళ్లి.. డ్రగ్స్‌ స్మగ్లర్‌గా మారిన యువకుడు


ఈ కేసులకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పగా, ’ మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలి’ అని సూచించాడు. ’మీ ఖాతాలో డబ్బులు ఆర్‌బీఐ అకౌంట్‌కు బదిలీ చేయాలి. 30 నిమిషాల్లో వెరిఫికేషన్‌ పూర్తి చేసి, మీ డబ్బు తిరగి మీ ఖాతాలో జమ చేస్తారు’ అని చెప్పాడు. ఇలా చేయని పక్షంలో మనీ లాండరింగ్‌ కేసులో అరెస్ట్‌ అవుతారని బెదిరించాడు. నమ్మిన మహిళ తన ఖాతాలో ఉన్న రూ.15.76 లక్షలను అతడు సూచించిన ఖాతాకు బదిలీ చేసింది. తర్వాత మోసపోయానని గ్రహించిన మహిళసైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.


- గూగుల్‌ మ్యాప్‌కు రేటింగ్‌ ఇస్తే డబ్బులు ఇస్తామని నమ్మించిన సైబర్‌ నేరగాళ్లు నగరవాసి నుంచి రూ.16.68 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన వ్యక్తికి వాట్స్‌పకాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ మ్యాప్‌కు రేటింగ్స్‌ ఇస్తే డబ్బులు ఇస్తామని నమ్మించారు. ముందుగా కొద్ది మొత్తం ఖాతాలో జమ చేశారు. మరింత డబ్బు కావాలంటే కొంత మొత్తం రీఫండబుల్‌ డిపాజిట్‌ చేయాలని సూచించారు. వారి మాటలు నమ్మిన వ్యక్తి రూ.16.68 లక్షలు వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. తర్వాత నుంచి ఫోన్‌లు స్విచ్చాఫ్‌ రావడంతో మోసపోయానని గ్రహించి, సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 23 , 2024 | 10:59 AM

Advertising
Advertising