Hyderabad: బ్యాంక్‌ను మోసగించిన మేనేజర్ అరెస్ట్..
ABN, Publish Date - Jun 27 , 2024 | 09:58 AM
కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్(Bank Manager) పరిస్థితి. తాను పనిచేస్తున్న బ్యాంక్‌నే మోసం చేసి కోట్లాది రూపాయలను తన సొంత అకౌంట్‌లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ కేసులో నాలుగు నెలల అనంతరం అతడిని బుధవారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
హైదరాబాద్: కంచే చేను మేసినట్లు ఉంది ఓ బ్యాంక్ మేనేజర్(Bank Manager) పరిస్థితి. తాను పనిచేస్తున్న బ్యాంక్‌నే మోసం చేసి కోట్లాది రూపాయలను తన సొంత అకౌంట్‌లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ కేసులో నాలుగు నెలల అనంతరం అతడిని బుధవారం ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. రామంతాపూర్ ఎస్‌బీఐ బ్రాంచి మేనేజర్(Ramanthapur SBI Branch Manager)గా పనిచేసిన గంగ మల్లయ్య కొందరు వ్యక్తుల పేరుతో నకిలీ గుర్తింపు కార్డులతో ఎస్‌బీఐలో బ్యాంకు అకౌంట్లు తెరిచారు. వారి పేరుతో రూ.3.28 కోట్ల రుణాలు మంజూరు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌కు కృష్ణా జలాలు నిలిపివేత...
అనంతరం ఆయా అకౌంట్ల నుంచి ఆ మొత్తాన్ని తన అకౌంట్‌లోకి బదిలీ చేసుకున్నారు. ఇదంతా ఫిబ్రవరిలో జరగగా మార్చిలో వచ్చిన బ్యాంక్ మేనేజర్ ఈ నకిలీ బాగోతాన్ని బయటపెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. గంగ మల్లయ్యతో పాటు మోసంలో పాలుపంచుకున్న బంజారాహిల్స్ సీఏజీ బ్యాంక్ మేనేజర్ షేక్ సైదులును పోలీసులు కోర్టులో రిమాండ్ చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 27 , 2024 | 09:58 AM