Hyderabad: రూ.2 లక్షల రుణం ఇస్తామని.. రూ.1.20 లక్షలు కాజేశారు
ABN , Publish Date - Jul 23 , 2024 | 10:58 AM
లోన్ ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Hyderabad Cybercrime Police) అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మనీష్‌కుమార్(24), ఆకాష్ కుమార్(24), కుందన్‌కుమార్(28), తెలంగాణకు చెందిన వెంకటేష్ మాన్‌జీ రాథోడ్ (21) ముఠాగా ఏర్పడి ప్రముఖ రుణ సంస్థల ప్రతినిధులమంటూ తక్కువ వడ్డీకి లోన్ ఇప్పిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు.
- లోన్ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
- నిందితులపై దేశవ్యాప్తంగా 401, తెలంగాణలో 24 కేసులు
హైదరాబాద్ సిటీ: లోన్ ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు(Hyderabad Cybercrime Police) అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన మనీష్‌కుమార్(24), ఆకాష్ కుమార్(24), కుందన్‌కుమార్(28), తెలంగాణకు చెందిన వెంకటేష్ మాన్‌జీ రాథోడ్ (21) ముఠాగా ఏర్పడి ప్రముఖ రుణ సంస్థల ప్రతినిధులమంటూ తక్కువ వడ్డీకి లోన్ ఇప్పిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. రుణం కావాలని సంప్రదించిన వారి నుంచి జీఎస్టీ, ఎన్‌ఓసీ, పెనాల్టీ పేరుతో అందినకాడికి డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ధనీ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ సంస్థలో పనిచేస్తున్నామంటూ బహదూర్‌పురాకు చెందిన వ్యక్తికి రుణం ఇప్పిస్తామని నమ్మించారు. బాధితుడు రూ. 2లక్షల రుణం కావాలని కోరగా, అతడి నుంచి ఆధార్, పాన్, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: స్మిత సబర్వాల్ పోస్ట్ కలకలం.. నగరంలో దివ్యాంగుల నిరసన
ప్రాసెసింగ్ చార్జీలు(Processing charges), జీఎస్టీ, టీడీఎస్, ఎస్‌జీఎ్‌సటీ, లేట్ పెనాల్టీ, క్లియరెన్స్, ఎన్‌ఓసీ, చెక్ క్లియరెన్స్ చార్జీలు, రీఫండబుల్ అమౌంట్ పేరుతో పలు దఫాలుగా బాధితుడి నుంచి రూ. 1,20,340 వసూలు చేశారు. బాధితుడు ఫోన్ చేయగా స్పందించలేదు. మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి ఆధ్వర్యంలో సైబర్ క్రైం ఇన్‌స్పెక్టర్ మధుసూధన్ రావు, ఎస్సై కె.సతీష్ రెడ్డిల బృందం ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 ఫోన్లు, 2 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై దేశవ్యాప్తంగా 401, తెలంగాణలో 24 కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News