ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నైజీరియన్‌తో సహా ఇద్దరు డ్రగ్‌ పెడ్లర్ల అరెస్ట్‌..

ABN, Publish Date - Aug 15 , 2024 | 11:23 AM

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌(Nigerian)తోపాటు ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ), బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీఎస్‌ కార్యాలయం(CCS Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి(CP K. Srinivas Reddy) కేసు వివరాలను వెల్లడించారు.

- రూ. 1.10 కోట్ల విలువైన డ్రగ్స్‌, వాహనం స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌(Nigerian)తోపాటు ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌న్యూ), బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీసీఎస్‌ కార్యాలయం(CCS Office)లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి(CP K. Srinivas Reddy) కేసు వివరాలను వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఓఫోజోర్‌ సన్‌డే ఇజెకి అలియాస్‌ ఫ్రాంక్‌ (42) డిప్లమా ఇన్‌ కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు.

ఇదికూడా చదవండి: Collector: పరీక్షలన్నీ చేస్తున్నారా.. మందులు ఇస్తున్నారా..?


ఇతడు 2016లో స్పోర్ట్స్‌ వీసాపై ఢిల్లీకి వచ్చాడు. న్యూఢిల్లీ(New Delhi)లోని ఆల్‌స్టార్‌ ఆఫ్రికన్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఫుట్‌బాల్‌ ఆడేవాడు. తర్వాత 2018లో బెంగళూరు(Bangalore)కు మకాం మార్చాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో నైజీరియాకు చెందిన డ్రగ్స్‌ విక్రేతలతో పరిచయం పెంచుకుని విక్రయాలు ప్రారంభించాడు. బెంగళూరులో ఉంటున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఆనస్‌ఖాన్‌ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. కొంతకాలం తర్వాత నగరానికి వచ్చి రాజేంద్రనగర్‌(Rajendranagar)లో ఉంటూ కోల్‌కతాకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు.


ఇతడి భార్యకు కూడా డ్రగ్స్‌ తీసుకునే అలవాటు ఉంది. దీంతో నైజీరియన్‌ డ్రగ్‌ సప్లయర్‌ ఓఫోజోర్‌ సన్‌డే ఇజెకితో పరిచయం పెట్టుకున్నాడు. ఇతడి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ కొనుగోలు చేసి, అధిక ధరలకు నగరంలో సబ్‌ పెడ్లర్లకు విక్రయిస్తున్నాడు. నగరంలో ఇతర ప్రాంతాలకు డ్రగ్స్‌ను ఇతడి భార్య సోదరుడు భోపాల్‌కు చెందిన ఆసిఫ్‌ఖాన్‌ ద్వారా సరఫరా చేసేవాడు.


వీరి దందాపై పక్కా సమాచారమందుకున్న హెచ్‌న్యూ, బంజారాహిల్స్‌ పోలీసులు వల పన్ని నిందితులు నైజీరియన్‌ ఓఫోజోర్‌ సన్‌డే ఇజెకితోపాటు ఆసన్‌ఖాన్‌, ఆసిఫ్‌ఖాన్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 36 గ్రామల కొకైన్‌, 140 గ్రాముల ఎండీఎంఏ, 9 ఎక్స్‌ట్రసీ పిల్స్‌, 32 గ్రాముల ఛరస్‌, 41 గ్రాముల ఎంఈఓడబ్ల్యూ, మారుతీ వ్యాగనార్‌ కారు, 5 ఫోన్లు, ప్యాకేజీ సామగ్రి, రూ.2,260 నగదు మొత్తం కలిపి రూ. 1.10 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2024 | 11:23 AM

Advertising
Advertising
<