Instagram: ఇదోరకం మోసం.. లైక్ కొట్టు.. డబ్బు పట్టు
ABN, Publish Date - Oct 16 , 2024 | 08:31 AM
ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో వీడియోలు లైక్ చేయండి.. డబ్బును తీసుకోండి అంటూ ప్రచారం చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి సుమారు రూ.20.35లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు.
- ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో వీడియోకు రూ.150 ఇస్తామని బురిడీ
- క్రిప్టో పేరుతో ఉచ్చులోకి దింపి రూ. 20.35 లక్షలు కాజేత
హైదరాబాద్ సిటీ: ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో వీడియోలు లైక్ చేయండి.. డబ్బును తీసుకోండి అంటూ ప్రచారం చేసిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి సుమారు రూ.20.35లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు(City Cyber Crime Police) ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ డీసీపీ కవిత తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన వ్యక్తి(39)కి ‘ఫ్రెషర్ వరల్డ్’ అనే కంపెనీ నుంచి వాట్సాప్ లో ఒక మెసేజ్ వచ్చింది. ‘ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు లైక్ చేసి, స్రీ ్క న్ న్‌షాట్స్ పంపితే ఒక్కో వీడియోకు రూ. 150 చొప్పున చెల్లిస్తాం.. వర్క్‌ఫ్రమ్‌హోమ్ చేసి రోజుకు రూ.4000-5000 వరకు సంపాదించుకోవచ్చు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: టెక్నిక్స్ తెలియకే టెక్ నెక్ పెయిన్!
మీకు ఇష్టమైతే రిప్లై ఇవ్వండి’ అని ఆ మెసేజ్ సారాంశం. దాంతో బాఽఽధితుడు ఓకే అని రిప్లై ఇచ్చారు. వెంటనే స్పందించిన అవతలి వ్యక్తులు టెలీగ్రామ్‌లో ఒక ఇన్‌స్టా లింకును పంపారు. లింకును ఓపెన్ చేసి ఒకటి, రెండు వీడియోలకు లైక్ చేసి స్ర్కీన్‌షాట్స్ పంపాడు. వాటికి డబ్బులు వచ్చాయి. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన మరో లింకును బాఽధితునికి పంపి ఉచ్చులోకి దింపారు. వర్క్‌ఫ్రమ్ చేసుకుంటూనే క్రిప్టోలో రూ. లక్షల్లో సంపాదించొచ్చని నమ్మించారు. అందులో డబ్బులు పెట్టగానే మొత్తం నష్టపోయినట్లు సమాచారం వచ్చింది. ఇదేంటని ప్రశ్నించగా.. మీరు టెక్నికల్ మిస్టేక్ చేసి ఉంటారని, ఇప్పుడే క్రిప్టో కరెన్సీకి చెందిన యూఆర్‌ఎల్ లింక్ పంపుతున్నాము అందులో చెక్ చేయండి అని చెప్పారు.
వారు పంపిన లింక్‌లో చెక్ చేయగా.. అందులో పెట్టుబడి పెట్టిన డబ్బులకు లాభాలు వచ్చినట్లు చూపించారు. కానీ విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకుండా చేశారు. మీరు మరింత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితేనే విత్‌డ్రా ఆప్షన్ కల్పిస్తామని చెప్పడంతో వారి మాటలు నమ్మి విడతలవారీగా రూ.20.35లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. అయినా విత్‌డ్రా ఆప్షన్ ఇవ్వకుండా, ఇంకా డబ్బులు చెల్లించాలని ఇబ్బంది పెట్టడంతో మోసమని భావించి బాధితుడు వెంటనే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
ఇదికూడా చదవండి: CM Revanth Reddy: సీఎం సంతకం చేసినా బదిలీల్లేవ్!
ఇదికూడా చదవండి: KTR: విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తున్న సర్కార్
ఇదికూడా చదవండి: తాళం వేస్తే కేసులు.. ఎవరి మాటల్తోనో కవ్వింపు చర్యలొద్దు
ఇదికూడా చదవండి: Gurukulas: గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలి
Read Latest Telangana News and National News
Updated Date - Oct 16 , 2024 | 08:31 AM