AP-TG: పిక్ పాకెటింగ్ టూ జూనియర్ జడ్జి.. ఇతడి స్కెచ్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే..
ABN, Publish Date - Oct 09 , 2024 | 07:27 PM
‘‘కే.సురేష్ జూనియర్ సివిల్ జడ్జి’’.. ట్రూ కాలర్‌లో ఈ పేరు కనిపించిందంటే చాలు.. కలెక్టర్లు, పోలీసు అధికారులు గజగజా వణికిపోవాల్సిందే. ‘‘మా టీం వస్తోంది.. పనులు చేసి పెట్టండి’’.. అని చెప్పడమే ఆలస్యం జిల్లా స్థాయి అధికారులు దగ్గరుండి పనులు చక్కబెట్టేవారు. సూటు.. బూటు.. ప్రోటోకాల్ కార్ సెటప్ చేసుకొని ఇతడు చేసిన నేరాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడో తెలుసుకుందాం..
‘‘కే.సురేష్ జూనియర్ సివిల్ జడ్జి’’.. ట్రూ కాలర్‌లో ఈ పేరు కనిపించిందంటే చాలు.. కలెక్టర్లు, పోలీసు అధికారులు గజగజా వణికిపోవాల్సిందే. ‘‘మా టీం వస్తోంది.. పనులు చేసి పెట్టండి’’.. అని చెప్పడమే ఆలస్యం జిల్లా స్థాయి అధికారులు దగ్గరుండి పనులు చక్కబెట్టేవారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తనకు దగ్గర బంధువని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతితులు, ఐపీఎస్, ఐఏఎస్‌లు, జడ్జిలలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారంటూ ఓ కలరింగ్ ఇచ్చాడు. సూటు.. బూటు.. ప్రోటోకాల్ కార్ సెటప్ చేసుకొని అసలు దందాకు తెరలేపాడు. పిక్ పాకెటింగ్‌తో మొదలైన అతడి నేర సామ్రాజ్యం.. చివరకు జూనియర్ జడ్జి పేరుతో కోట్ల రూపాయల అక్రమార్జన వరకూ చేరుకుంది. కంచర్ల సురేష్ కంత్రీ పనులకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పిక్ పాకెటింగ్ నుంచి మొదలై..
ఒంగోలు జిల్లా మేదరమెట్ల మంటలం ప్రాసంగపాడు గ్రామానికిచెందిన కంచర్ల సురేష్.. మొదట పిక్ పాకెటింగ్‌కు పాల్పడుతుండేవాడు. అనంతర కాలంలో ఓ చిన్న పత్రికలో విలేకరిగా చేరాడు. విలేకరిగా ఉన్న సమయంలో కొన్ని నేరాలు, మోసాలకు పాల్పడడంతో సదరు సంస్థ అతనికి దేహ శుద్ధి చేసి బయటికి వెళ్లగొట్టింది. దీంతో ఆ తర్వాత ఓ న్యాయవాది దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. అక్కడ కూడా ఇలాంటి నేరాలే చేయడంతో దేహశుద్ధి చేసి సాగనంపారు. ఇంటికి చేరుకున్న అతను.. కొన్నాళ్లు దోశల బండి పెట్టుకొని జీవనం సాగించాడు. అయితే ఈ క్రమంలో అతను అసలు కుట్రకు తెరలేపాడు.
మోసం ఇలా మొదలైంది..
పిట్ ప్యాకెట్లతో మొదలైన ప్రస్థానం ఓ చిన్న పత్రికలో విలేకరి, ఆ తర్వాత న్యాయవాది దగ్గర గుమస్తా ఇలా మెట్టు మెట్టు ఎక్కుతూ ఏకంగా ఓ సంస్థకు తానే యజమాని అంటూ ప్రకటించుకున్నాడు. సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ అనే సంస్థకు తనే ఫౌండర్, యజమానిని అంటూ ఆన్‌లైన్ వేదికగా ప్రచారం చేశారు. దీనికితోడు ఐడీ కార్డులు రూపొందించాడు. తాను జడ్జినని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి (President Droupadi Murmu) సమీప బంధువునంటూ ఆర్గనైజింగ్‌లోని సభ్యులకు పరిచయం చేసుకుంటూ జిల్లా జిల్లా తిరుగుతూ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేయడం మొదలెట్టాడు.
సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ ఫౌండర్ అయిన రాజమండ్రికి చెందిన కావూరి వరలక్ష్మికి తెలీకుండా ఏకంగా తానే ఫౌండర్, చైర్మన్ అని చెప్పుకోవడం మొదలెట్టాడు. కరోనా టైంలో సంస్థ తరపున సేవలు నిలిపేసిన ఆమె కొన్ని కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కంచర్ల సురేష్.. సంస్థకు తానే యజమాని అని ప్రకటించుకుని తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ఒక టీంను ఏర్పాటు చేశాడు. దాదాపు వెయ్యి మంది దాకా ఉద్యోగులను తయారు చేశాడు. తాను సూచించిన మార్గంలోకి వస్తే.. అందరికీ మంచి దారి చూపుతానంటూ వారందరినీ నమ్మబలికాడు. జిల్లాలో పరిష్కారం కానీ ఏ సమస్యనైనా పరిష్కరిస్తానని చెప్పాడు. అలాగే వచ్చిన కమిషన్‌లో అందరికీ వాటా ఇస్తానంటూ ఆశ చూపాడు.
ఐడీ నెంబర్ మార్పింగ్ చేసి మరీ..
కుట్రలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తికి చెందిన తిరుపతి సురేష్ అనే వ్యక్తిని కలుపుకొని పెద్ద ఎత్తున అక్రమాలకు తెగపడ్డాడు. కడప జిల్లాకు చెందిన ఓ అడ్వకేట్ ఐడీ నంబర్‌ను మార్పింగ్ చేసుకొని న్యాయవాదిగా చలామణి అయ్యేవాడు. వైజాగ్ నుంచి కర్నూలు వరకు, కర్నూల్ నుంచి తెలంగాణ రాష్ట్ర మొత్తం జిల్లా, జిల్లాలో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం వెయ్యి మందిని పోగు చేసుకున్నాడు. వీరి ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు పడుతున్నా, జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్థాయిలో పెండింగ్ ఉన్న ఫైళ్లను తాను క్లియర్ చేయిస్తానంటూ దందాలకు తెరలేపాడు. ఈ క్రమంలో ఎందరో అమాయకుల నుంచి దాదాపు నాలుగు కోట్ల దాకా వసూలు చేశాడు. డిసెంబర్‌లో తిరుపతిలో మహానాడు చేయాలని, ఇందుకోసం ప్రతి జిల్లా కమిటీ రూ.5 లక్షలు పోగుచేయాలని అందరినీ ఆదేశించాడు.
జూనియర్ సివిల్ జడ్జి పేరుతో..
ఓ సిమ్ నంబర్‌ను సంపాదించిన సురేష్.. ట్రూ కాలర్‌లో కే.సురేష్ జూనియర్ సివిల్ జడ్జి తెలంగాణ అని పేరు మార్చేశాడు. సెటిల్మెంట్లకు వెళ్లినప్పుడు నేరుగా జిల్లా ఎస్పీలతో మాట్లాడేవాడు. తమ టీం వస్తోందని, పనులు చేసి పెట్టాలంటూ సదరు అధికారులను ఆదేశించేవాడు. ఇలా జడ్జి పేరుతో ఎందరికో ఫోన్లు చేస్తూ పనులు చక్కబెట్టుకునేవాడు. సురేష్ నుంచి ఫోన్ వచ్చిందంటే చాలు.. కలెక్టర్లు, ఎస్పీలు క్షణాల్లో కింది స్థాయి అధికారులను ఆదేశించేవారని తెలిసి, పనులు పూర్తయ్యేలా చేసేవారని తెలసింది. ఇలా ఏపీ, తెలంగాణలో ఎందరో రైతులకు పాస్ పుస్తకాలు, పెట్రోల్ బంక్‌లకు పర్మిషన్లు ఇప్పిస్తూ, దందాలకు పాల్పడుతూ కోట్లు సంపాదించినట్లు వెలుగులోకి వచ్చింది.
చివరికి దొరికిపోయాడిలా..
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తనకు సమీప బంధువు అని, త్వరలో జడ్జిగా మరో రాష్ట్రానికి బదిలీపై వెళ్తున్నానంటూ టీం సభ్యులకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండేవాడు. వాట్సప్ గ్రూపులో పోస్టులను గమనిస్తున్న ఆర్టీఐ నేషనల్ సెక్రటరీ కిరణ్ అనే వ్యక్తికి అనుమానం కలిగింది. దీంతో సురేష్ పోస్టులపై ఓ కన్నేసి ఉంచాడు. చివరకు కర్నూలు కేంద్రంగా ఒక కేసును అతడికి ఎరగా వేశాడు. ఇలా సురేష్ అసలు గుట్టును రట్టు చేసి, అతడి అక్రమాలను వెలుగులోకి తీసి.. వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం సంచలనంగా మారింది. నకిలీ జడ్జి కంచర్ల సురేష్‌కు ఫోన్ చేసిన కిరణ్.. ఆర్టీఐ సంస్థ యజమాని కావూరి వరలక్ష్మిని సంప్రదించానని, నీ గుట్టంతా బయటికి తీశానని చెప్పడంతో చివరికి అతడు కాళ్లబేరానికి వచ్చాడు.
చనిపోయినట్లు క్రియేట్ చేసి..
తాను చేసిన నేరాలన్నింటినీ అంగీకరిస్తూ.. చివరకు చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. అంతటితో ఆగకుండా ఫోటోలు కూడా క్రియేట్ చేసి, గ్రూపులో సభ్యులకు షేర్ చేశాడు. అప్పటి నుంచి తాను వాడుతున్న మూడు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి, అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోయాడు. సురేష్‌తో పాటూ కలిసి పనిచేసిన తిరుపతి సురేష్ తనకేం సంబంధం లేదంటూ తిరుగుతున్నాడు. ఈ వార్త అందరికీ తెలియడంతో సురేష్ బాధితులంతా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..
Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..
Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..
Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 09 , 2024 | 07:32 PM