Nalgonda: రూ.5 కోట్లు అప్పు ఇస్తామని ఆశపెట్టి టోకరా..
ABN, Publish Date - Aug 08 , 2024 | 11:48 AM
అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు.
- రూ.60 లక్షలతో పరారీ
- 24 గంటల్లో నిందితుల అరెస్ట్ చేసిన నల్లగొండ జిల్లా పోలీసులు
మిర్యాలగూడ(నల్గొండ): అప్పు ఇస్తామని చెప్పి ఓ ముఠా రూ.60 లక్షలను దోచేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు 24 గంటల్లోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిందితులను పట్టుకుని డబ్బు రికవరీ చేశారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ(Nalgonda District Miryalaguda) వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్ కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్‌సమీర్ నిజామాబాద్(Nizamabad)లో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఇదికూడా చదవండి: Minister Sitakka: గత సర్కారు నిర్వాకంతోనే.. పంచాయతీలకు ఇక్కట్లు
కొత్త వెంచర్‌కు డబ్బు కోసం శ్రీకాంత్(Srikanth) అనే మధ్యవర్తి ద్వారా నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన కండెల గణేష్, కండెల మల్లికార్జున్‌ను సంప్రదించాడు. సమీర్‌కు అప్పుగా రూ.5 కోట్లు ఇవ్వడానికి వారు అంగీకరించి జూలై 31న రూ.90 లక్షలు ఇచ్చారు. సమీర్ నుంచి ఇంటి దస్తావేజులు, ప్రామిసరీ నోట్లు, బ్లాంక్ చెక్కులు తీసుకున్నారు. మిగతా డబ్బు కావాలంటే తాము ఇచ్చిన రూ.90 లక్షలు, అప్పు ఇవ్వబోయే రూ.5కోట్లకు వడ్డీగా రూ.60 లక్షలు ముందస్తుగా తీసుకుని ఈ నెల 5వ తేదీన మిర్యాలగూడ(Miryalaguda)కు రావాలని చెప్పారు. మరో ఇరువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులను వెంట తీసుకుని సమీర్ వారి చెప్పినట్లుగానే రూ.కోటిన్నర నగదుతో అక్కడకు వెళ్లాడు. గణేష్, మల్లికార్జున్‌లు ఇంతకు ముందు ఇచ్చిన రూ.90 లక్షలు తీసుకొని చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఇంటి డాక్యుమెంట్లు సమీర్‌కు ఇచ్చేశారు.
అనంతరం సమీర్ రూ.5 కోట్ల అప్పు గురించి గణేష్, మల్లికార్జున్‌లను అడగ్గా వడ్డీ డబ్బులు తెచ్చారా అని వారు ప్రశ్నించారు. దీంతో సమీర్ తన వెంట తెచ్చిన బ్యాగును తెరిచి రూ.60 లక్షలను చూపించబోయాడు. దీంతో గణేష్, మల్లికార్జున్‌తో పాటు మరో ఇద్దరు విజయ్, రాజు కలిసి సమీర్ అతడి స్నేహితులపై దాడి చేసి నగదు ఉన్న బ్యాగును తీసుకుని పరారయ్యారు. జరిగిన మోసాన్ని గ్రహించి సమీర్ అతడి స్నేహితులు నిందితులను వెంబడించే ప్రయత్నం చేయగా, గణేష్, మల్లికార్జున్ ముఠాకు చెందిన అనుపమ, వీరమ్మ, గంగమ్మతో మరికొందరు వారిపై దాడి చేసి పారిపోయారు. ఈ మోసంపై సమీర్ అదేరోజు రాత్రి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన పోలీసులు డీఎస్పీ రాజశేఖరరాజు ఆదేశాల మేరకు వన్‌టౌన్, టౌటౌన్ సీఐలు సుధాకర్, నాగార్జున ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
బుధవారం ఉదయం నిందితుల్లో కొందరైన అనుపమ, వీరమ్మ, గంగమ్మను పట్టుకుని వారి నుంచి రూ.60 లక్షల నగదు, డబ్బు లెక్కింపు యంత్రం, యాపిల్, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు స్వాఽధీనం చేసుకున్నారు. మిగతా నిందితులు మిర్యాలగూడకు చెందిన కండెల గణేష్, మల్లిఖార్జున్‌లు హైదరాబాద్‌కు చెందిన విజయ్, రాజు, వీరన్న, గంగమ్మ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితులపై గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో పలుకేసులు నమోదైనట్లు తెలిపారు. 24 గంటల్లో కేసును ఛేదించిన డీఎస్పీ, సీఐలను ఎస్పీ అభినందించారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News
Updated Date - Aug 08 , 2024 | 11:48 AM